జడ్జి తమ్ముడిపై దాడి ఘటనలో నిందితుడు తెలుగు తమ్ముడేనట

Update: 2020-09-29 06:50 GMT
ఏ చిన్న అవకాశం లభించినా అధికారపక్షం మీద ఏదోలా బురద జల్లే ప్రయత్నాలు ఏపీలో అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకున్న ఉదంతంగా చెప్పాలి. తాజాగా సస్పెండ్ అయిన జడ్జి తమ్ముడ్నిఅధికారపక్షానికి చెందిన నేతలు దాడి చేసినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే.. ఈ విషయంలో ఏపీ అధికారపక్షానికి సంబంధం లేదని.. దాడికి పాల్పడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అనుచరుడిగా పోలీసులు తేల్చారు. దాడికి పాల్పడిన యువకుడు జిల్లాలోని తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరుడిగి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు. జడ్జి తమ్ముడిపై దాడి చేసిన ప్రతాప్ రెడ్డి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా తేలినట్లుగా జిల్లా ఎస్పీ స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. ప్రతాప్ రెడ్డి తల్లి విజయలక్ష్మి టీడీపీ తరఫున ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్ వేసినట్లుగా తేలింది. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీ చేసిన దుష్ప్పచారంలో నిజం లేదని.. ప్రతి విషయాన్ని పక్కదారి పట్టేలా వాదనలు వినిపించటం విపక్షానికి ఒక అలవాటుగా మారిందని చెప్పక తప్పదు.జడ్జి సోదరుడిపై దాడి వెనుక అధికారపక్షానికి చెందిన వారి హస్తం ఉందంటూ ఆగమాగం చేసిన తమ్ముళ్లు.. సోమవారం వెలుగు చూసిన విషయాల్ని చూసిన తర్వాత మౌనముద్ర దాల్చటం గమనార్హం.
Tags:    

Similar News