తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం వెనుక మిస్టరీని ఛేదించేందుకు రిటైర్డ్ జడ్జి ఎ. ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఓ విచారణ కమిషన్ 2017లో ఏర్పాటైన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అపోలో ఆస్పత్రిలో జయలలితను పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లకు ఆర్ముగ స్వామి కమిషన్ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించిన జీసీ ఖిల్ననీ (పల్మనాలజీ విభాగం), అంజన్ త్రిఖా(ఎనిస్థీయాలజీ ప్రొఫెసర్ ), నితీష్ నాయక్(కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్)లు వైద్య నిపుణుల బృందం ఆగస్టు 23, 24 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆర్ముగం కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన వైద్యులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2016 డిసెంబర్ 3వ తేదీన జయలలిత ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరి సహాయం లేకుండా దాదాపు 20 నిమిషాలు ఆమె కూర్చున్నారని వారు....కమిషన్ కు వెల్లడించారు.
విచారణ కమిషన్ ముందు హాజరైన ఆ ముగ్గురు ఎయిమ్స్ వైద్యులపై న్యాయవాది ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మనవి ప్రకారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలితకు తాము చికిత్స అందించామని ఆ ముగ్గురు వైద్యులు...వివరణ ఇచ్చారు. జయలలిత చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికపుడు అప్పటి తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఆరోగ్య శాఖా మంత్రి విజయ్ భాస్కర్ లకు వివరించామని చెప్పారు. 2016 డిసెంబర్ 3వ తేదీన జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని వారు చెప్పారు. అయితే, అనుకోకుండా ఆమె ఆరోగ్యం విషమించిందని, ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వెల్లడించారు.