నచ్చినోళ్లను నెత్తిన పెట్టుకోవటం. నచ్చనోళ్లను పూర్తిగా అణగదొక్కేయటం లాంటివి కొందరు రాజకీయ అధినేతలు చేస్తుంటారు. నోరు విప్పితే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మాటలు ఉండే ప్రధాని మోడీ లాంటోళ్లు.. నిత్యం దేశ శ్రేయస్సు.. దేశానికి మేలు చేయటం కోసం.. వ్యవస్థలు గతి తప్పకుండా ఉండేందుకు వీలుగా తెగ శ్రమిస్తుంటారని చెబుతుంటారు. మరి.. అంతటి మంచి మోడీని పలువురు ఎందుకు తప్పు పడుతారు?
ఆయన నిర్ణయాలు.. ఆలోచన తీరు ఏ మాత్రం బాగోదని ఎందుకంటారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. తాజా ఉదంతాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం ఒకటి సంచలనంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల్ని పక్కన పెట్టేసి.. తన సొంత నిర్ణయాన్ని తీసుకోవటం వివాదంగా మారింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రవిశంకర్ ఝూను కేంద్రం నియమించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సుల్ని పక్కన పెట్టేసి మరీ ఝూను ఎంపిక చేశారు. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్ సంజయ్ కుమార్ సేథ్ ఈ నెల 10న పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సేథ్ స్థానంలో మధ్యప్రదేశ్ సీజేగా బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ అకిల్ ఖురేషీని నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం మే10నసిఫార్సు చేసింది. అయితే.. మిగిలిన సిఫార్సుల్ని ఓకే చేసిన మోడీ సర్కారు ఖురేషీ ఫైల్ ను మాత్రం పెండింగ్ లో పెట్టింది.
ఎందుకు ఆయన్ను పక్కన పెట్టారన్న విషయానికి వెళితే.. ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ ఖురేషీ గుజరాత్ హైకోర్టులో జడ్జిగా సుదీర్ఘకాలం పని చేశారు. 2004-12 మధ్య కాలంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా.. ఆయన మంత్రివర్గంలో హోంశాఖ సహాయమంత్రిగా పని చేసిన అమిత్ షా కు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇచ్చారు.
ముఖ్యంగా గ్యాంగస్టర్ సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షాను రెండు రోజులు కస్టడీకి పంపుతూ ఆయన ఇచ్చిన ఉత్తర్వు తీవ్ర సంచలనంగా మారింది. ఇదొక్కటే కాదు.. మోడీ ప్రధాని అయ్యాక జస్టిస్ ఖురేషీ గుజరాత్ హైకోర్టు సీజేగా పని చేసే అవకాశం వచ్చినా.. న్యాయశాఖ అడ్డుకుంది. గత ఏడాది గుజరాత్ రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టుకు ప్రమోషన్ పొందినప్పుడు సీనియర్ గా ఉన్న ఖురేషి తాత్కాలిక సీజేగా నియమితులు అవుతారని భావించినా అది వర్క్ వుట్ కాలేదు.
ఇలా ఖురేషీని ప్రతి విషయంలో మోకాలు అడ్డుతున్న మోడీ సర్కారు.. తాజాగా కోలీజియం నిర్ణయాన్ని పక్కన పెట్టేసి మరీ.. ఆయన పదోన్నతిని అడ్డుకొని వేరే వారిని నియమించటం న్యాయవర్గాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తనకు నచ్చని వారి విషయంలో మోడీ ఎంత కఠినంగా ఉంటారన్న దానికి తాజా ఉదంతం చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు.