ఐపీఎల్ వేలంలో ఆ ఇద్ద‌రిదే హ‌వా!

Update: 2018-01-29 13:48 GMT
శని - ఆదివారాల్లో బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్‌ వేలంపాట ఆస‌క్తిక‌రంగా సాగిన సంగ‌తి తెలిసిందే. గేల్ వంటి బ్యాట్స్ మ‌న్ ను మొద‌టి రోజు ఎవ‌రూ కొన‌క‌పోవ‌డం....రెండో రోజు చివ‌రకు 2 కోట్ల త‌క్కువ ధ‌ర‌కు పంజాబ్ ద‌క్కించుకోవ‌డం....ఉనాద్క‌త్(11.5 కోట్లు) - కె. గౌత‌మ్(6.2 కోట్లు) ల‌కు అనూహ్యంగా భారీ ధ‌ర ప‌ల‌క‌డం.....ఇషాంత్ శ‌ర్మ‌ - ప్ర‌గ్యాన్ ఓజా - ల‌సిత్ మ‌లింగ వంటి క్రికెట‌ర్ల‌ను ఎవ‌రూ తీసుకోక‌పోవ‌డం.....ఈ వేలంపాట‌లో హైలైట్స్ అని చెప్పవచ్చు. అయితే, ఈ వేలం పాట‌లో ఆట‌గాళ్ల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యంగ్ స్ట‌ర్స్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ముంబై ఇండియన్స్ య‌జమాని ముఖేశ్‌ అంబానీ తనయుడు ఆకాశ్  - కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స‌హ య‌జ‌మాని జూహీ చావ్లా కూతురు జాన్వీ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్ లో - పెడెల్ ను రైజ్‌ చేయడంలో వీరిద్ద‌రూ ముందుండ‌డం విశేషం.
 
జుహీ చావ్లా - నిర్మాత జయ్‌ మెహతాల కూతురు అయిన జాన్వీ వేలంలో పాల్గొన్న అతి పిన్న వ‌యస్కురాలిగా పేరు తెచ్చుకుంది. వేలం పాటలో యాక్టివ్ గా ఉండ‌డంతో జాన్వీ పై అంద‌రూ ఎక్కువ‌గా ఫోక‌స్ చేశారు. ఓ ద‌శ‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమానురాలు - బాలీవుడ్‌ నటి  ప్రీతిజింటాతో పాటు జాన్వీ(17) కూడా ఈ వేలంలో ఆట‌గాళ్ల కోసం విప‌రీతంగా పోటీ ప‌డింది. వేలంలో మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ ప‌డుతున్న ఈ చిన్న‌ది ఎవ‌రంటూ అంద‌రూ ఆరా తీశారు. కేకేఆర్ మ్యాచ్ ల‌కు జూహిచావ్లా త‌ప్ప‌క హాజ‌రై సంద‌డి చేస్తుంది. మ‌రి ఈ ఐపీఎల్ లో తల్లితో కలిసి జాన్వి కూడా మ్యాచ్ ల‌కు వ‌స్తుందో.....లేక కేవ‌లం బిడ్డింగ్ కే ప‌రిమిత‌మ‌వుతుందో వేచి చూడాలి.


Tags:    

Similar News