బ్యాడ్మింటన్ లో రికార్డులు సృష్టిస్తున్న తెలుగుతేజం పీవీ సింధు ను తీర్చిదిద్దిన వ్యక్తిగా - మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎంతో పేరున్న ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లేయర్ల సెలక్షన్ లో ఆయన పక్షపాత వైఖరి కనబరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అండర్ 19 వరల్డ్ కప్ పోటీలకు ఆయన కుమార్తెను ఎంపిక చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
త్వరలో ఇండోనేషియాలో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ పోటీలకు అండర్ 19 కేటగిరిలో గోపిచంద్ కుమార్తె గాయత్రిని ఎంపిక చేశారు. జూనియర్ విభాగపు సింగిల్స్ ర్యాంకింగులు చూస్తే ఆమె చాలా వెనుకబడి ఉందట. దీంతో అటువంటి ఆమెను ఎలా ఎంపిక చేస్తారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
దీంతో సెలక్షన్ లో అవకతవకలను వివరిస్తూ వైష్ణవి అనే ప్లేయర్ ప్రధానికి ఓ లేఖను రాసింది. అయితే... బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ విషయంలో తమకేమీ సంబంధం లేదంటోంది. సెలక్షన్ ప్రక్రియలో తాము పాలు పంచుకోమని బాయ్ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. దీంతో గాయత్రి సెలక్షన్ గోపీచంద్ వల్లే జరిగిందని... ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అర్థమైపోయిందని ప్లేయర్లు ఆరోపిస్తున్నారు.