జూనియర్ ఎన్టీయార్ ఈ రోజున టాలీవుడ్ లో బిగ్ షాట్. ఆయన టాప్ స్టార్స్ లో ఒకడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా సొంతం చేస్తున్న ఈ నందమూరి చిన్నోడు మూడవ తరంలో వెండి తెర మీద ఇరగదీస్తున్నాడు. మరింతకాలం రాణించగల సత్తాను టన్నుల కొద్దీ దాచుకున్న చిన్న రామయ్య తాత రామయ్య పెట్టిన టీడీపీ వైపు చూస్తాడా లేదా అన్నదే ఇపుడు తమ్ముళ్లలో సాగుతున్న చర్చ.
జూనియర్ ని తెస్తే టీడీపీకి విక్టరీ గ్యారంటీ అని తెలుగుదేశంలో మెజారిటీ సెక్షన్ అభిప్రాయపడుతోంది. జగన్ ఇమేజ్ ని ఢీ కొట్టే సత్తా ఈ కుర్ర రాముడికే ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు టూర్ లో ఎక్కడ చూసినా జూనియర్ రావాలనే గీతాలాపన ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే జూనియర్ మదిలో ఏముంది. ఆయనకు పాలిటిక్స్ మీద ఇంటరెస్ట్ ఉందా లేదా అన్న చర్చ కూడా ఉంది.
మరి జూనియర్ మది తలుపును తట్టి చూసేవారు ఎవరున్నారు. ఆయన మీడియా ముందు మాట్లాడితే సినిమా గురించే మాట్లాడుతారు. పాలిటిక్స్ ఊసే కలలో కూడా చర్చించరు. అయితే జూనియర్ మాటలను బట్టి ఆయన వైఖరిని బట్టి ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అన్నదే విశ్లేషకుల మాట. అలాంటి విశ్లేషణకు తావు ఇచ్చేలా ఈ మధ్య జరిగిన బింబిసారా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ చేసిన స్పీచ్ నుంచి కూడా కొంత మ్యాటర్ ని ఏరి మరీ చెప్పాల్సింది చెబుతున్నారు.
ఇక్కడ జూనియర్ స్పీచ్ లో తన తండ్రి హరిక్రిష్ణను తలచుకున్నారు. అలాగే తాత ఎన్టీయార్ ని కూడా తలచుకున్నారు. మా కుటుంబాన్ని మూడు తరాలుగా ఆదరిస్తున్న అభిమాన దేవుళ్ళు అంటూ జూనియర్ చెప్పుకొచ్చారు. మరి తాత ఎన్టీయార్, తండ్రి హరిక్రిష్ణ తరువాత బాలక్రిష్ణ కూడా ఉన్నారు కదా. చెప్పాలీ అంటే స్టార్ హీరోగా దశాబ్దాలుగా బాలయ్యే ఉన్నారు. అలాంటి బాబాయ్ ని మాత్రం ఎందుకో జూనియర్ పేరు ప్రస్థావించలేదు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అన్నట్లుగా సీన్ ఉందని ఇప్పటికైతే అనుకున్నారు. కానీ జూనియర్ మాత్రం నందమూరి వంశం అంటూ మాట్లాడినపుడల్లా తండ్రితో పాటు బాబాయ్ ని సైతం తలచుకునే వారు. కానీ బింబిసారా విషయంలో అది జరగలేదు. దాంతో బాలక్రిష్ణతో జూనియర్ కాస్తా గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారా అన్న డౌటానుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే జూనియర్ ని టీడీపీ తరఫున ప్రచారానికి పిలుస్తారు అని కూడా చర్చ సాగుతోంది.
మరి అక్కడ బాలయ్య ఉన్నారు. అలాగే నారా లోకేష్ ఉన్నారు. దాంతో జూనియర్ మనకెందుకు వచ్చిన రాజకీయం అని దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు చాణక్య రాజకీయం పనిచేస్తేనే జూనియర్ పసుపు డ్రెస్ వేసుకుంటారు తప్ప లేకపోతే నో పాలిటిక్స్ అనే మాటనే చెబుతారు అంటున్నారు.