ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తలెత్తిన వివాదాల గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన మాజీ దోస్తులు కూడా తమదైన కామెంటరీని మొదలు పెట్టారు.గతంలో వైకాపా తరపున పనిచేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఒకప్పుడు జగన్‌ను ఒక రేంజ్‌లో పొగిడేసిన వీళ్లు ఇప్పుడు జగన్‌పై ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా ఉంది.
జూపూడి ప్రభాకర్‌రావు, మారెప్ప.. వీళ్లిద్దరూ వైఎస్‌ఆర్‌కు ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులుగా మెలిగారు. జగన్ తరపున వకల్తాపుచ్చుకొని మాట్లాడారు.
అలా రెండు మూడు సంవత్సరాల పాటు జగన్ తరపున గట్టిగా మాట్లాడిన వీళ్లు తర్వాతి కాలంలో ఆయనకు దూరం అయ్యారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దొరకకపోడంతో మారెప్ప జగన్‌పై ధ్వజమెత్తడం మొదలుపెట్టాడు. ఎన్నికల ముందే వైకాపాకు టాటా చెప్పేశాడు ఈ మాజీ మంత్రి.
ఇక జూపూడిది మరో కథ. వైకాపా తరపున సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జూపూడి తన ఓటమికి వైకాపా నేతలే అని ఆరోపణ చేశాడు. వారిపై జగన్ చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి నిష్క్రమించాడు.
ఇప్పుడు అసెంబ్లీలో తలెత్తిన వివాదాల విషయంలో జూపూడి జగన్ తీరును విమర్శించాడు. మారెప్ప వైకాపా నేతలందరి తీరునూ విమర్శించాడు. ఈ విమర్శలు బాగానే ఉన్నాయి కానీ.. ఒకనాడు జగన్‌ను ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేసిన వారి నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తుండటం మాత్రం చిత్రమైన అంశం.
తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ఇంకా ఇప్పుడే జగన్‌పై మాటల యుద్ధం మొదలుపెట్టాడు. ముందు ముందు ఇది ఇంకా ఎలా ఉంటుందో!