వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీకి పట్టు ఉన్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి... కానీ, ఇప్పుడు అక్కడ ఆ పార్టీకి గట్టి దెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
కొద్దికాలంగా వైసీపీ కార్యక్రమాలకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. వారిప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ గూటికి చేరితే జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఎన్నికల సమయంలో వైసిపి తరుపున ఆరుగురు, తెలుగుదేశంపార్టీ తరుపున ఐదుగురు శాసనసభ్యులు గెలుపొందగా, చీరాల నియోజకవర్గం నుండి ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవల ఆమంచి తెలుగుదేశం కండువా కప్పుకోవడంతో వైసిపికి, తెలుగుదేశంపార్టీకి చెరి సమానంగా బలం ఉంది. ప్రస్తుతం మరో ఇద్దరు శాసనసభ్యులు వైసిపిని వీడి తెలుగుదేశంపార్టీలో చేరితే ఆ పార్టీ బలం ఎనిమిదికి చేరి వైకాపా బలం నలుగురికి తగ్గే అవకాశాలున్నాయి.
...కాగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జూపూడి ప్రభాకరరావు ఈ ఫిరాయింపుల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉన్నప్పుడు కీలకంగా ఉన్న జూపూడికి టీడీపీలోనూ ప్రాధాన్యం దక్కుతోంది. ప్రస్తుతం ఇద్దరు వైసీపీ నేతలు టీడీపీలోకి రానుండడం వెనుక జూపూడి మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది.