హైకోర్టులో రూల్ మారింది

Update: 2015-08-17 05:33 GMT
సాంకేతిక ప‌రిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంత‌లు తొక్కుతూ స‌రికొత్త‌గా ప్ర‌జ‌ల‌ను ప‌రుగులు పెట్టిస్తోంది. దీనిని అంది పుచ్చుకుని ప్ర‌జ‌లు, ప్రైవేటు వ్య‌వ‌స్థలు దూసుకుపోతుంటే చాలా ప్ర‌భుత్వ శాఖాలు ఈ టెక్నాల‌జీని వాడుకోలేక అవి ఇంకా నిద్రాణ వ్య‌వ‌స్థ‌లోనే ఉంటున్నాయి. టెక్నాల‌జీ సీఎంగా పేరున్న చంద్ర‌బాబు కూడా ఇటీవ‌ల త‌న కేబినెట్ మీటింగ్‌ లో మంత్రులంద‌రు కాగితాల‌ను ప‌క్క‌న‌పెట్టి ల్యాప్‌ ట్యాప్‌ ల ద్వారానే కేబినెట్ మీటింగ్‌ కు రావాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

అందుకు త‌గిన‌ట్టుగానే ఆయ‌న దేశంలోనే తొలి ఈ కేబినెట్ మీటింగ్ పెట్టి రికార్డుల కెక్కారు. తాజాగా రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి హైకోర్టులో ఓ స‌రికొత్త టెక్నాల‌జీ న్యాయ‌వాదుల‌కు అందుబాటులోకి రానుంది. ఇక నుంచి న్యాయ‌వాదులు కాగితాల‌తో పిటిష‌న్లు తీసుకువెళ్లి వాద‌న‌లు చేయ‌కూడ‌దు. లాప్‌ ట్యాప్‌, టాబ్ నుంచే వారు కోర్టులో త‌మ వాద‌న‌లు వినిపించాల్సి ఉంటుంది.

న‌వంబ‌ర్ నుంచి ఈ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఛీప్ జస్టిస్ బోస‌లే చెప్పారు. అలాగే కేసుల పురోగ‌తిపై కోర్టులో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి దాని ద్వారా స‌మాచారం వెల్ల‌డించ‌నున్నారు. ఆండ్రాయిడ్ టెక్నాల‌జీ ద్వారా నాలుగు ర‌కాల స‌మాచారాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని...వీటిలో కేసుల స‌మాచారం..కాజ్ లిస్టు ఉంటాయ‌న్నారు. ప‌న్నెండు ర‌కాల కియోస్క్‌ లు ఏర్పాటు చేసి స‌మాచారం అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

ఏదేమైనా న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఈ టెక్నాల‌జీ వాడ‌డం శుభ‌సూచ‌కం..ఈ విధంగా అయినా పెండింగ్ కేసులు త‌గ్గి...ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర‌మే న్యాయం త్వ‌ర‌గా జ‌రిగితే అంత‌క‌న్నా కావాల్సిందేముంటుంది.
Tags:    

Similar News