తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంటికింద రాయిలాగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడంలో ముందున్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ ఇపుడు ఏపీలోని సమస్యలపైనా ఉద్యమించడం మొదలుపెట్టారు. ఆదివాసీల పక్షాన తన గళం వినిపిస్తూ ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. కేఆర్ పురం ఐటీడీఏ వద్ద గిరిజన చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మాజీ జస్టిస్ చంద్రకుమార్ మన్యంలో భూవివాదాల నేపథ్యంలో ఆదివాసీలపై అక్రమంగా ఒక్క కేసు బనాయించినా సుప్రీం కోర్టు వరకూ వెళ్లతామని ఏపీ సర్కారును హెచ్చరించారు.
ఈ సదస్సులో చంద్రకుమార్ మాట్లాడుతూ గిరిజనుల కోసం ఉద్దేశించిన చట్టాలు - హక్కులు తెలుగు రాష్ట్రాల్లో సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1970 రెగ్యులేషన్ చట్టం ప్రకారం మన్యంలో గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయకూడదన్నారు. కొనుగోలు చేస్తే ఆ భూమిని గిరిజనులకు అప్పగించేందుకు ఐటీడీఏలు, అధికారులు కృషి చేయాలని సూచించారు. కానీ ఈ చట్టాలేవీ అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న గిరిజనులకు భూమికి బదులు భూమిని ఇవ్వాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని చంద్రకుమార్ మండిపడ్డారు. వారికి జీవనాధారాన్ని కల్పించాలని విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివాసీల కోసం ఎవరూ మాట్లాడరు అనే భ్రమ నుంచి ప్రభుత్వం బయటకు రావాలని - ప్రజా సంఘాలు - అభ్యుదయవాదులు వారికి అండగా ఉంటారని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. త్వరలోనే ఆదివాసులతో మరోమారు సమావేశమై ఏపీలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటానని ఆయన ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/