చంద్ర‌బాబుకు చెత్త వ్యాఖ్య‌లు అంటూ చంద్రు కౌంట‌ర్‌

Update: 2021-12-16 17:30 GMT
మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సూర్య నటించిన జై భీమ్ సినిమాకు డైలాగులు రాయడం ద్వారా ఇటీవల చంద్రు వార్తల్లోకి ఎక్కారు. ఈ క్రమంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఉద్దేశించి జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కంటే కోర్టుల్లోనే ఎక్కువుగా పోరాటాలు చేయాల్సి వ‌స్తోంద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే హైకోర్టు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశంలోనే ఏ హైకోర్టులో లేనట్టుగా... ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కనీస సౌకర్యాలు కూడా లేవని... అలాంటి పరిస్థితుల్లో తాము విధులు నిర్వహిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులు కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సైతం కేవలం కొంద‌రు న్యాయ‌మూర్తులు రిటైర్ అయ్యాక కూడా పదవుల కోసమే వైసిపి భజన చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఆర్ధిక నేరగాడు చేస్తోన్న ప‌నులు ఆయనకు కనిపించలేదా ? అని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు చంద్రు కూడా ఘాటుగానే స్పందించారు. తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి మేలు జరిగేలా ఎందుకు ? ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సైతం తన కుమారుడికి పదవి తీసుకొని రోజు జగన్ ను పొగుడుతున్నారని కూడా సెటైర్ వేశారు. ఇక‌ విజయవాడ పర్యటనలో తాను చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో చంద్రు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

రిటైర్మెంట్ తర్వాత పదవుల కోసమే తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశాన‌న్న‌ బాబు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త వ్యాఖ్య‌లు ఎవరూ నమ్మవద్దని... తాను రిటైర్ అయిన తర్వాత తొమ్మిది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవులు తీసుకోలేదని చెప్పారు. కట్టు కథలు సృష్టించి ఎలా వ్యాప్తి చేయాలో ఈ విషయాన్ని చూస్తేనే అర్థమవుతుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఇప్పటితో అయినా ముగుస్తుందో లేదా మరింత దూరం వెళుతుందో చూడాలి.
Tags:    

Similar News