మ‌రో చెత్త రికార్డు జ‌స్టిస్ క‌ర్ణ‌న్ సొంతం!

Update: 2017-06-12 07:44 GMT
నోటి తీట ఎన్ని క‌ష్టాలు తీసుకొస్తుందో.. ఎన్ని తిప్పుల్ని నెత్తి మీద‌కు తెస్తుందో జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌ ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నాన్ని తీవ్రంగా విమ‌ర్శించ‌టం.. ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేయ‌టం.. సుప్రీంకోర్టు జ‌డ్జిల‌కు జైలుశిక్ష వేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌టం.. ఇలా ఒక‌టేమిటి? ఎన్నో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తారు క‌ల‌క‌త్తా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సీఎస్ క‌ర్ణ‌న్.

సుప్రీంకోర్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. అన‌వ‌స‌రంగా కేసుల్ని మీద వేసుకోవ‌ట‌మే కాదు.. త‌న మాట తీరుతో మ‌రిన్ని చిక్కుల్ని మీదేసుకున్న ఆయ‌న‌.. చివ‌ర‌కు జైలుశిక్ష ప‌డే వ‌ర‌కూ విష‌యాన్ని తెచ్చుకున్నారు. కోర్టు ధిక్కార నేరాన్ని ఎదుర్కొన్న ఆయ‌న్ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చారు.

సుప్రీం తీర్పుతో ఒక్క‌సారి అలెర్ట్ అయిన ఆయ‌న జైలును త‌ప్పించుకునేందుకు ప‌త్తా లేకుండా పోయారు. అనంత‌రం త‌నకు ప‌డిన శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌టానికి ప్ర‌య‌త్నాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ స‌ఫ‌లం కాక‌పోవ‌టంతో అండ‌ర్ గ్రౌండ్ లోనే ఉండిపోయారు. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే.. అరెస్ట్ చేద్దామ‌ని చూస్తున్న పోలీసుల‌కు ఆయ‌న ఆచూకీ దొర‌క‌టం లేదు.

హైకోర్టు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. జైలుశిక్ష ప‌డిన తొలి న్యాయ‌మూర్తిగా అరుదైన రికార్డు ఆయ‌న‌కు ద‌క్కింది. ఇదే కాదు.. తాజాగా ఆయ‌న ప‌ద‌వీవిర‌మ‌ణ జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న కార్యాల‌యానికి రాలేదు. బ‌య‌ట‌కు వ‌స్తే ఎక్క‌డ అరెస్ట్ చేస్తార‌నుకున్నారేమో కానీ.. ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు కార్యాల‌యానికి రాని మొట్ట‌మొద‌టి హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఒక రికార్డును జ‌స్టిస్ క‌ర్ణ‌న్ సొంతం చేసుకున్నారు. మ‌రోవైపు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌టానికి.. సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమ‌లు చేయ‌టానికి డీజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలోని ప‌శ్చిమ‌బెంగాల్ పోలీసు బృందం గ‌త నెల ప‌దో తేదీ నుంచి చెన్నైలోనే ఉంది. అయిన‌ప్ప‌టికీ క‌ర్ణ‌న్ ఆచూకీ మాత్రం ల‌భించ‌టం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News