పోలీసులు.. రాజకీయ టార్గెట్ అవుతున్నారే!: సీజే జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు.. ఏపీకీ వర్తిస్తాయా
ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు వివిధ కేసుల విచారణలో చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలోని జగన్ సర్కారుకు సూటిగా తగులుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ ఛత్తీస్‌గఢ్ ఏడీజీ కేసు విచారణ సందర్భంగా.. చేసిన వ్యాఖ్యలు.. మళ్లీ ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా తాకాయి. అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సస్పెండయిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ మౌఖికంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. జస్టిస్ రమణ మాట్లాడుతూ, దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయన్నారు. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇది కొత్త రకం ధోరణి అని పేర్కొన్నారు. దీనిని ఆపాలన్నారు. గుర్జిందర్ పాల్ సింగ్ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించారు. సింగ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారిమన్, ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సింగ్ అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ), ఆర్థిక నేరాల విభాగం ఆయనపై జూన్ 29న కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో జూలై 1న సోదాలు చేసి, ఆయనపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు.
ఇదిలావుంటే, సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితులను ప్రస్తావించినట్ల యిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2019కి పూర్వం వివిధ పదవులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నా యంటున్నారు. బాధితుల్లో ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, మరో ఉన్నతాధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అదేసమయంలో ప్రస్తుత పోలీసులు చాలా మంది జగన్ ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.