ఏపీ రాజధాని అమరావతి అని పేర్కొంటూ వేలాది ఎకరాల భూముల్ని సేకరించి.. రాజధానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో శంకుస్థాపన చేసి.. వడివడిగా రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగంగా పనులు మొదలు పెట్టటం.. కొన్ని భవనాలు పూర్తి కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో అధికార మార్పిడి జరగటం.. జగన్ సర్కారు అధికారంలోకి రావటం తెలిసిందే. తాను సీఎం అయ్యాక.. కొద్ది నెలలకే ఏపీ రాజధాని అమరావతి మాత్రమే కాదు మరో రెండు నగరాలు కూడా రాజధాని నగరాలే అంటూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దానికి సంబంధించిన చట్టబద్ధత ఏర్పాట్లు షురూ చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం అనుసరించిన తీరుకు నిరసనగా అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రియాక్టు కావటం.. పెద్ద ఎత్తున నిరసనతోపాటు.. దీక్ష చేస్తుండటం తెలిసిందే. ఇప్పుడా దీక్షకు ఏకంగా వెయ్యి రోజులయ్యాయి.
ఇలాంటివేళ.. ఏపీ రాజధానిగా అమరావతి కాదన్న దానిపై ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు ఇప్పటికి వ్యాఖ్యలు చేస్తుండటం.. త్వరలోనే విశాఖకు రాజధానిని తరలిస్తారంటూ చెబుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతిని మార్చటానికి ఎంతమాత్రం అవకాశాలు ఉన్నాయి? అన్న విషయాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలగౌడ్ తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా వెల్లడించారు.
ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసిన వైనంతో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని.. మూడు రాజధానుల మాటతో హైకోర్టును తరలించాలని తపిస్తున్న అధికార పార్టీ నేతల మాటలకు భిన్నంగా ఆయన అభిప్రాయం ఉంది. తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన తన అభిప్రాయాన్నివెల్లడించారు.
మాస్టర్ ప్లాన్ లో ఇష్టానుసారంగా మార్చేసే అవకాశం లేదన్న ఆయన ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చెబితే..''రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఇష్టానుసారం మార్పులుచేసేందుకు వీలుగా సీఆర్ డీఏ చట్టాన్ని ప్రభుత్వం సవరించటం సాధ్యం కాదు. ఒకసారి లేఅవుట్ ప్లాన్ ను ప్లానింగ్ అథారిటీ ఆమోదించిన తర్వాత మంత్రివర్గం దానిలో ఇష్టానుసారం మార్పులు చేయటానికి వీల్లేదు. ఇదే విషయాన్ని వీఎస్ ముద్దప్ప వర్సెస్ బెంగళూరు కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లే అవుట్ ప్లాన్ నే మార్చటానికే వీల్లేనప్పుడు.. రాజధాని మాస్టార్ ప్లాన్ ను ఎలా మార్చేస్తారు?' అంటూ సూటిగా ప్రశ్నించారు.
అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా అమరావతి నుంచి ఏపీ హైకోర్టును మార్చటం రాజ్యాంగపరంగా సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టును మార్చాలంటే ఏమేం జరగాలన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. 'రాష్ట్ర హైకోర్టు తీర్మానం లేకుండా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించకుండా హైకోర్టును మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికే లేదని చెప్పారు. ఈ మాటల్ని విన్నప్పుడు కేంద్రానికే సాధ్యం కానప్పుడు.. రాష్ట్రంలోని జగన్ సర్కారుకు హైకోర్టును మార్చే ఛాన్సులే తక్కువన్న విషయం స్పష్టమైందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.