కొద్ది రోజులుగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించాయి. సిక్కింలోని డొక్లామ్ వద్ద చైనా వైఖరికి నిరసనగా ఆ దేశ ఫోన్ బ్రాండ్ లు ఒప్పో, వివో స్టోర్లపై కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల పై కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆమెను దేశద్రోహి అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆమె పై ట్విట్టర్లో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు గుత్తా జ్వాల తల్లి చైనా లోని టియాన్‌జిన్‌లో జన్మించారు. దీంతో, కొంతమంది ఆకతాయి నెటిజన్లు ఆమెపై అభ్యంతరకర విమర్శలు చేశారు. అయితే, ఆ అల్లరి మూకలకు అంతే ఘాటుగా గుత్తా జ్వాల సమాధానమిచ్చారు.
మీ అమ్మది చైనా కావడంతోనే నువ్వు ప్రతిసారి మోదీని వ్యతిరేకిస్తున్నావా అంటూ ఓ నెటిజన్ జ్వాలను ప్రశ్నించాడు. దీనికి జ్వాల ఘాటుగా బదులిచ్చారు. ఈ సంభాషణలోకి తన తల్లిదండ్రులను లాగితే.. తనలోని మరో కోణాన్ని చూడాల్సి వస్తుందంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఏదిపడితే అది కామెంట్ చేయడం సరికాదని సూచించారు.
భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమేయం వల్లే గుత్తా జ్వాల తన భర్తతో విడిపోయినట్లు గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అజారుద్దీన్ అంశం గురించి మరో నెటిజన్ ప్రస్తావించాడు. అజార్ అంశాన్ని లేవనెత్తిన నెటిజన్ పై జ్వాల ఘాటుగా మండిపడ్డారు. 'నా ముందుకు వచ్చి అలా మాట్లాడి చూడు' అంటూ జ్వాల వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ షమి ఇదేవిధంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు.