గో ఫస్ట్ దివాలా తీస్తే.. టికెట్ల ధరల్ని పెంచేస్తారా? కేంద్రమంత్రి కీలక ప్రశ్న
చౌక విమానయాన సంస్థగా పేరున్న గోఫస్ట్ ఎయిర్ లైన్స్ దివాలా తీసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఎట్టకేలకు స్పందించారు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా. గోఫస్ట్ ఎయిర్ లైన్స్ దివాలా ప్రకటన తర్వాత.. ఆ సంస్థ నడిపే రూట్లలో విమాన టికెట్లను భారీగా పెంచేస్తూ ఎయిర్ లైన్స్ వ్యవహరిస్తున్న తీరును కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఇక్కడ రెండు అంశాల్ని ప్రస్తావించాలి. అందులో ఒకటి.. ఎయిర్ లైన్స్ కక్కుర్తి. రెండోది.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం.
మొదటి విషయానికి వస్తే.. ఎయిర్ లైన్స్ సంస్థలు చేసేది వ్యాపారం. సమాజ సేవ కాదు. సమాజ సేవ చేయాల్సిన కేంద్రం.. తన అధీనంలోని ఎయిరిండియాను ప్రైవేటు చేతుల్లో పెట్టేయటం తెలిసిందే. ఒకవేళ.. ఎయిరిండియాను ప్రభుత్వం ప్రైవేటుకు ధీటుగా నడిపి ఉంటే.. దానికే ప్రయాణికులు తొలి ఓటు వేసేవారు. ఇంత సాధనా సంపత్తి ఉండి కూడా ఎయిరిండియా ఊసురు తీసే వరకు కేంద్రం నిద్రపోలేదు. దీనికి మోడీ సర్కారే కాదు.. దాని ముందున్న ప్రభుత్వాలు సైతం తలో చేయి వేశారు.ఈ పాపం అందరిదీ.
ఇక.. ఇతర విమానయాన సంస్థల విషయానికి వస్తే.. గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ దివాలా ప్రకటన చేసి.. సర్వీసులు నిలిపిన రూట్లలో మిగిలిన ఎయిర్ లైన్స్ తమ టికెట్ల ధరల్ని పంచేసింది. ఈ కారణంగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కేంద్రమంత్రి తొలిసారి స్పందించారు. తాజాగా ఎయిర్ లైన్స్ అడ్వైజరీ గ్రూప్ తో భేటీ అయిన జ్యోతిరాదిత్య.. టికెట్ ఛార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. సముచిత రీతిలో ఛార్జీలు ఉండేలా తగు విధానాన్ని రూపొందించుకోవాలన్న సూచననుచేశారు. పెరిగిన ఛార్జీలను ఎయిర్ లైన్స్ సంస్థలు తమకు తాముగా, సొంతంగా సమీక్షించుకోవాలని పేర్కొన్నారు.
ప్రైవేటు ఎయిర్ లైన్స్ ను నియంత్రించేందుకు వీలు ఉన్నప్పటికి.. కేంద్రమంత్రి సలహా రూపంలో చెప్పటం ఏమిటి? సీరియస్ గా వార్నింగ్ ఇవ్వొచ్చుగా? అంటే.. ఇక్కడే మోడీ సర్కారు చేసిన 'గొప్ప' పని బయటకు వస్తుంది. గతంలో ఎయిర్ లైన్స సంస్థలు దేశీయంగా టికెట్ల ధరలకు సంబంధించి కేంద్రం విధించిన పరిమితులు ఉన్నాయి. వాటిని ఎత్తేస్తూ.. మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటంతో ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దేశీయ రూట్లలో టికెట్ల ధరల నియంత్రణను మోడీ సర్కారు ఎత్తేసిన తర్వాత ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందని చెప్పాలి. ఇదే టికెట్ల ధరల్ని మరింత పెంచేలా చేసింది. ఇవాల్టి రోజున విమాన ప్రయాణం సంపన్నులు.. వ్యాపారవేత్తలు మాత్రమే కాదు.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు కూడా చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు ఇలాంటి పరిస్థితుల్లో.. టికెట్ల ధరలపై కేంద్రం కాసింత కంట్రోల్ ఉంచేలా నిర్ణయం తీసుకోవాల్సిందే. మరి.. దీన్ని మోడీ సర్కారు ఎందుకు వదిలేసిందన్న దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది.