సింధియా బీజేపీలోకి.. స్కెచ్ ముందే సిద్ధమైందా?

Update: 2020-03-11 15:30 GMT
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరడం చూసి అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అనాదిగా సింధియాలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ లోనే ఎదిగారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం పీఠం ఇవ్వలేదనే కారణంతో సింధియా కాంగ్రెస్ ను వీడడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరడానికి ముందే స్కెచ్ గీశారు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. నడ్డా కుమారుడు గిరీష్ నడ్డా పెళ్లి రిసెప్షన్ ఇందుకు వేదికైందట.. ఈ విందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అక్కడే బీజేపీ లోకి సింధియాను లాగడానికి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి మాట్లాడడంతో సింధియా మనసు మారినట్టు తెలిసింది.

దీంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఈ యువ జ్యోతిరాధిత్య కాంగ్రెస్ కు గుడ్ చెప్పడం సంచలనమైంది. కాంగ్రెస్ లో ప్రాధాన్యత దక్కకపోవడం.. చిన్న చూపు చూడడమే బీజేపీలోకి సింధియా చేరడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమిత్ షా, మోడీ గట్టి హామీ ఇవ్వడం.. భవిష్యత్ పై భరోసా కల్పించడంతోనే సింధియా బీజేపీ లో చేరిపోయారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచాక.. ఇదే సింధియాను సీఎం చేస్తామని రాహుల్ అన్నా సోనియా సహా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోపోవడంతోనే ఆయన కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరినట్టు సమాచారం. సింధియా అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకుంది.
Tags:    

Similar News