మధ్యప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పుతూ అక్కడి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంపై బీజేపీలో ఉన్న ఆయన మేనత్తలు సంతోషిస్తున్నారు. మేనల్లుడి రాకను స్వాగతిస్తున్నారు. జ్యోతిరాదిత్య మేనత్తల్లో ఒకరైన రాజస్తాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజె స్పందిస్తూ జ్యోతిరాదిత్య రాక ఎంతో సంతోషంగా ఉందన్నారు. సింధియా స్వభావం, బలం, ధైర్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని రాజే తెలిపారు. ‘‘ఈ సమయంలో రాజమాత విజయరాజె సింధియా ఉంటే ఎంతో గర్వించేవారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా తామంతా ఒకే పార్టీలో ఉండడం సంతోషంగా ఉందన్నారు.
మరో మేనత్త, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే కూడి సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్‌కు స్వాగతం అంటూ సింధియాకు చేరికను స్వాగతించారామె. కాగా గ్వాలియర్ రాజమాత విజయరాజె సింధియా సుదీర్ఘ కాలం బీజేపీలో ఉన్నారు. ఆమె కుమార్తెలే వసుంధర రాజె, యశోధర రాజె సింధియాలు.. వీరిద్దరూ బీజేపీలో ఉండగా కుమారుడు మాధవ రావ్ సింధియాలో కాంగ్రెస్‌లో కొనసాగారు. కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన విమాన ప్రమాదంలో మరణించారు. మాధవరావ్ కుమారుడే జ్యోతిరాదిత్య. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చి 18 ఏల్లుగా కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. దీంతో బీజేపీలో ఉన్న ఇద్దరు మేనత్తలూ మేనల్లుడి రాకను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.