38 ఎక‌రాల కొన్నామ‌న్న కేకే ఇంకేం చెప్పారంటే..

Update: 2017-06-10 19:30 GMT
గ‌డిచిన కొద్దిరోజులుగా రాజ‌ధానిలో అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల దుమారం భారీ ఎత్తున సాగుతోంది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించిన ప‌లువురు నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు వ‌ర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే.. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించి టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ సభ్యుడు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన  కేకేపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న భారీ ఎత్తున భూముల్ని అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు చేయించార‌న్న విమ‌ర్శ ఉంది.

స‌ర్వే నెంబ‌రు 36లో కేకే కుమార్తె గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి పేరు మీద 50 ఎక‌రాలు కొన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ యాభై ఎక‌రాల్లో 38 ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమి ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ భూముల్ని గోల్డ్ స్టోన్ కంపెనీ కేకే కుమార్తెకు అమ్మిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ భూముల్ని రిజిస్ట్రేష‌న్ల‌ను చేయించిన అధికారిని స‌స్పెండ్ చేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. తమ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై కేకే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే..

= ఇబ్ర‌హీంప‌ట్నం భూముల అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌పై మాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ప‌చ్చి అబ‌ద్ధం. అందులో ఇసుమంత కూడా నిజం లేదు.

= రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీం ప‌ట్నంలో 38 ఎక‌రాల భూమి కొనుగోలుపై నా కుమార్తె.. కోడ‌లిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం లేదు.

= 2013లో అగ్రిమెంట్ చేసుకొని 2015లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాం.

= దండు మైలారంలో భూములు కొన్నాం. ఎలాంటి వివాదంలో ఉన్న భూముల్ని కొనుగోలు చేయ‌లేదు.

= చ‌ట్ట‌బ‌ద్ధంగానే భూముల్ని కొని రిజిస్ట్రేష‌న్లు చేయించాం. ఎలాంటి వివాదాస్ప భూముల్ని కొనుగోలు చేయ‌లేదు.

= చ‌ట్ట‌ప్ర‌కార‌మే భూముల్ని కొన్నాం. మేం దొంగ‌లం కాదు.

=  మేం కొనుగోలు చేసిన భూములు ప్ర‌భుత్వ భూములు కావని హైకోర్టు ఆర్డ‌ర్ కూడా ఉంది.  హైకోర్టు ఆదేశాల్ని త‌ప్పు ప‌ట్ట‌టం స‌రికాదు.

= ఎవ‌రి ద‌గ్గ‌ర భూములు కొన్నామో నాకు తెలుసు.

= ప్ర‌జాప్ర‌తినిధులుగా చ‌ట్టాలు చేసే మేం.. త‌ప్పులు చేయం. చ‌ట్టాల‌పై  గౌర‌వం ఉంది.
Tags:    

Similar News