టీఆర్ ఎస్ విడుదల చేసిన తొలి విడత జాబితాలో చోటు దక్కని వారిని బుజ్జగించి వేరే ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. వారికి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఇచ్చారని తెలుస్తోంది. తొలి విడత జాబితాలో చోటు దక్కని బాబు మోహన్ - నల్లాల ఓదెలును శుక్రవారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ కు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానం అవసరం లేదని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కానీ - ఇతర పదవులు కానీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఖైరతా బాద్ సీటు విషయంలో కేకే - దానం మధ్య పోటీ నడుస్తోందని సమాచారం.
ఖైరతాబాద్ టికెట్‌ను తన కుమార్తె విజయలక్ష్మికి లేదంటే కుమారుడు విప్లవ్ కుమార్ కు ఇవ్వాలని కేకే పట్టుబడుతున్నట్టు సమాచారం. దానం నాగేందర్ విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, అభ్యర్థులను ప్రకటించని వరంగల్ తూర్పు - చొప్పదండి - మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
టికెట్ దక్కని కొండా సురేఖ నేడు టీఆర్ ఎస్ కు రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తుండడంతో ఆమె విషయాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. వరంగల్ తూర్పు స్థానాన్ని బస్వరాజు సారయ్య ఆశిస్తుండగా, మల్కాజిగిరి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి - ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు - ఎంపీ మల్లారెడ్డి ఆశిస్తున్నారు. ఇక మేడ్చల్ - వికారాబాద్ స్థానాలను వలస నేతలతో భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.