ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ రేపు సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని చెప్పారు. ``మాది పగిలిపోయే గ్లాస్ కాదు - తొక్కితొక్కి ఊడిపోయే సైకిల్ కాదు - తుప్పుపట్టిన ఫ్యాన్ కాదు.. మాది హెలికాఫ్టర్`` అని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ - వైసీపీలు ఓడిపోబోతున్నాయని.. విజయం ప్రజాశాంతి పార్టీదేనని కేఏ పాల్ ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ - వైసీపీలు గెలవవని పాల్ ప్రకటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు - వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం వృథా అని పాల్ వివరించారు. టీడీపీ - వైసీపీలు ఓడిపోబోతున్నందున వలసలు ఆపితే మేలన్నారు. ఇప్పుడున్న నాయకులు పార్టీల మారడానికే ఆసక్తి చూపిస్తున్నారని.. ఆ ఆసక్తి ప్రజాసేవ చేయడంలో లేదని అన్నారు. టీడీపీ - వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఐతే.. వారిని ఆ పార్టీ అధినేతలు భయపెడుతున్నారని పాల్ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అనే విషయం మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
ఇదిలాఉండగా - జనసేనతో పొత్తు గురించి మరోమారు పాల్ ప్రకటించారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చిస్తామని ఒంటరిగా జనసేన పోటీ చేస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. అందుకే.. ప్రజాశాంతితో పొత్తు పెట్టుకోమని పవన్‌ను అడుగుతున్నామన్నారు. తన తరఫున ప్రచారం చేయమని ఈ సందర్భంగా పవన్ ను ఆయన కోరారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు పాల్... ఐదేళ్లు వితంతు ఫించను గుర్తుకిరాని చంద్రబాబుకు - చివరి మూడు నెలలు ఫించన్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.