హవ్వా.. బాబునే డమ్మీని చేసిన కేఏపాల్

Update: 2019-04-09 05:50 GMT
ఏపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇంత వేడిలోనూ మధ్యలో పోటీపడుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ జనాలను రిలాక్స్ ఇస్తున్నాడు. తన కామెడీ, భాష, వ్యక్తీకరణతో నవ్వులు పూయిస్తున్నాడు.  నర్సాపురం ఎంపీ బరిలో దిగిన పాల్ ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

చంద్రబాబు ఏపీని పాలించలేకపోతున్నాడట.. పాల్ వస్తే ఈ బాధలన్నీ పోతాయని బాబు భావిస్తున్నాడట.. నేనేమీ చేయలేకపోతున్నానని.. అప్పులు తీసుకురాలేకపోతున్నానని.. పాల్ వస్తే నాకు ఈ తలనొప్పులు తప్పుతాయని.. పాల్ అన్నీ చూసుకుంటాడని చంద్రబాబు భావిస్తున్నాడని కేఏపాల్ కామెంట్ చేశాడు. చంద్రబాబు ఎప్పుడూ తన ఆశీర్వాదం తీసుకుంటాడని.. అందుకే తనపై బాబుకు ప్రేమ అంటూ కేఏపాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ రాజకీయాల్లో నవ్వులు పూయిస్తున్నాయి.

ఇక నర్సాపురంలో జనసేన అభ్యర్థిగా పోటీపడుతున్న నాగబాబుకు కూడా కౌంటర్ ఇచ్చాడు కేఏపాల్.. నర్సాపురంలో రోడ్ షో నిర్వహిస్తూ కేఏపాల్ డ్యాన్స్ చేశాడు.. ‘చూశారా.. నాలాగా నాగబాబు డ్యాన్స్ చేయగలడా.. అలాగే నాలాగా పాలన కూడా చేయలేడు’ అంటూ కుప్పిగంతులు వేశాడు. ఇలా పాల్ డ్యాన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఇక హెలిక్యాప్టర్ గుర్తుకు కళ్లు మూసుకొని నొక్కేయండని.. అభివృద్ధి గురించి నేను, దేవుడు చూసుకుంటామని పాల్ అనేయడం విశేషం.. దేవుడితో కలిసి పాల్ పాలించడం ఎలా ఉంటుందో చూడాలంటే జనాలు ఓటేయాలని చెబుతున్నాడు..

ఇలా కేఏపాల్ కితకితల ప్రసంగాలు, కామెడీ జనాలను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రసంగాలతో తన గ్లామర్ దెబ్బతిందని.. ముఖానికి ఎన్నికల తర్వాత ఫేషియల్ చేసుకుంటానని పాల్ చెప్పడం నవ్వులు పూయించింది. ఎంతైనా పాల్ లాంటి రాజకీయ నేత ఈ హాట్ పాలిటిక్స్ ఉండడం కామెడీ పంచడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బుర్రలు హీటెక్కిన రాజకీయ నేతలకు పాల్ వీడియోలను చూపిస్తే చాలు వాళ్లు రిలాక్స్ అయిపోవడం పక్కా.. ఇలా సాగుతోంది పాల్ గారి ప్రచార హోరు..
    
    
    

Tags:    

Similar News