కేసీఆర్ ముక్కు పిండేస్తా..న‌న్ను చూస్తే పారిపోతాడు

Update: 2019-04-02 05:05 GMT
కొన్ని మాట‌లు కొంద‌రు మాత్ర‌మే అన‌గ‌ల‌రు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఏ అధినేత‌ను అయినా విమ‌ర్శించే స‌త్తా ఉన్న నేత‌లు ఒక‌రిద్ద‌రుకు మించి ఉండ‌రేమో. ఇక‌.. వెనుకా ముందు చూసుకోకుండా ఎవ‌రైనా స‌రే.. బ‌స్తీ మీద స‌వాల్ అన్న‌ట్లుగా మాట్లాడే త‌త్త్వం మొన్న‌టివ‌ర‌కూ ఎవ‌రికి ఉండేది కాదు. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆ కొర‌త‌ను తీర్చార‌ని చెప్పాలి.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని చీల్చి చెండాడే పాల్ మాట‌లు కాస్తంత కామెడీగా అనిపించినా.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే సీరియ‌స్ కామెంట్లు కొన్ని అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీరియ‌స్ గా కామెంట్లు చేసే ద‌మ్ము మొన్న‌టి వ‌ర‌కూ ఎవ‌రికి లేద‌నే చెప్పాలి. ఇప్పుడా కొర‌త తీరుస్తూ.. ఎవ‌రైనా స‌రే పాల్ నోటికి బ‌లి కావాల్సిందే అన్న రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మొన్న‌టికి మొన్న ప‌వ‌న్‌.. జ‌గ‌న్‌.. చంద్ర‌బాబుల‌పై విరుచుకుప‌డిన పాల్.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ప‌డ్డారు. త‌న‌ను చూస్తే చాలు కేసీఆర్ పారిపోతారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌.. కేసీఆర్ ను ఎదుర్కొనే స‌త్తా త‌న‌కు మాత్ర‌మే ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముక్కు పిండేస్తానంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌నే చేశారు. పాల్ కున్న అదృష్టం ఏమంటే.. ఆయ‌న ఎన్ని మాట‌లు అన్నా.. వాటిని ప‌ట్టించుకోన‌ట్లుగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో.. ఆయ‌న మ‌రింత‌గా చెల‌రేగిపోతున్నారు.

తెలంగాణ ఉద్య‌మం నాటి నుంచి నేటి వ‌ర‌కూ కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసినోళ్లు.. బండ‌కేసి బాదిన‌ట్లుగా విమ‌ర్శ‌లు చేసింది చాలా త‌క్కువ‌. ఇప్పుడా లోటును తీరుస్తూ.. మీడియాకు కావాల్సినంత మ‌సాలాను ఇస్తున్నార‌ని చెప్పాలి. పాల్ లాంటి నేత నోటికి చిక్కిన కేసీఆర్‌.. తాజాగా త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.  ముక్కు పిండేస్తా.. కేసీఆర్ కు న‌న్ను చూస్తే భ‌యమ‌ని చెప్పిన పాల్.. ఎందుకిలా?  కార‌ణం ఏమిటి?  అన్న విష‌యాలు కూడా చెప్పేస్తే మంచిగా ఉంటుంది క‌దా పాల్ జీ?
Tags:    

Similar News