కేసీఆర్‌.. చెడ్డీగ్యాంగ్‌.. పాల్ కామెంట్స్ గురూ!

Update: 2022-10-26 09:31 GMT
ప్ర‌జాశాంతి నాయ‌కుడు, శాంతి దూత‌గా పేర్కొనే కేఏ పాల్‌.. పొలిటిక‌ల్ కామెడీలో .. ఇది పీక్ స్టేజ్ .. అనేంత‌గా ఆయ‌న రెచ్చిపోయారు. తాజాగా ఆయ‌న సీఎం కేసీఆర్‌పైనే రెచ్చిపోయారు. ఆయ‌న‌కు స‌వాళ్లు కూడా రువ్వారు. గ‌త ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చినవో చెప్పాకే మునుగోడుకు రా.... నేను మునుగోడు లోనే ఉన్న.. దమ్ముంటే మునుగోడు లో బహిరంగ చర్చ కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్....? అని పాల్ రెచ్చిపోయారు.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ ఎలా గెలిచిందో... మునుగోడు లో జరగబోయే యుద్ధంలో గెలుపు నాదే! అని పాల్ అన్నారు. అంతేకాదు.. అక్క‌డితో ఆగ‌లేదు.. ఇంకా ఏమ‌న్నారంటే.. ``రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల రక్తాన్ని  జలగల పీల్చుకు తింటున్న  కేసీఆర్, అతని  దండుపాళ్యం ముఠాకు ఓటుతో తరిమికొట్టండి. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు  తీర్పు... తెలంగాణ ప్రజాల భవిష్యత్ కు మార్పు అవ్వాలి.`` అని వ్యాఖ్యానించారు.

రోడ్ షోలో మ‌రిన్ని..

మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పలేని కెసిఆర్, అతని చెడ్డి గ్యాంగ్ దమ్ముంటే బహిరంగ చర్చ కు రావాలని డిమాండ్ చేశారు. అహంకారం తలకెక్కిన కేసీఆర్ ను ఓడించాలని మునుగోడు ప్రజలను కోరారు. భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ప్రజలు సంబురాలు చేసుకున్నారో.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో KA పాల్ నీ గెలిపించి.. తెలంగాణ బలిసిన వర్గాలది కాదు బలహీన వర్గాలది అని ఓట్లతో  తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

`` దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఆత్మగౌరవాన్ని  అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి. యావత్ తెలంగాణ ప్రజల రక్తం పీల్చి దోచుకున్న సొమ్ముతోనే కేసీఆర్ ఓట్లు కొంటున్నడు, కోట్లు కుమ్మరిస్తున్నాడు . బిజెపి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి వారు పంచే ప్రతి రూపాయి మన సొంత డబ్బే, ఆ డబ్బులన్నీ మనవే.. తీసుకోండి`` అని వ్యాఖ్యానించారు.

``ఎంతోమంది ఆత్మ బలిదానాలతో కలలు కనిపిచ్చుకున్న బంగారు తెలంగాణ కానీ కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు.  గత ఎన్నికల్లో ఇచ్చిన ఫేక్ హామీలెన్ని నెరవేర్చినవో సమాధానం చెబితేనే కేసీఆర్  మునుగోడులో తిరగనియ్యండి... లేదంటే తరిమి కొట్టండని పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో అడుగు పెడతా, పట్టపగలే చుక్కలు చూపిస్తా... ప్రజా సమస్యలపై గళం విప్పుతా... అని స‌వాల్ చేశారు పాల్‌. కాలేశ్వరం ప్రాజెక్టులో తిన్న కోట్ల రూపాయల్ని కక్కిస్తాన‌న్నారు  మునుగోడు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి... తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్దేశించే ఎన్నిక ఈ మునుగోడు ఎన్నిక అని వ్యాఖ్యానించారు.  అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆత్మగౌరవ ఎన్నిక ఇది అన్నారు.  అయితే.. పాల్ ఇంత‌గా రెచ్చిపోతున్నా .జ‌నం .సీరియ‌స్‌గా తీసుకుంటారా? అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News