సరిగ్గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ప్రజా శాంతి పార్టీ పేరిట ఓ రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఈ ఎన్నికల్లో ఏపీలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తానని కూడా సంచలన ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు కాస్తంత పలుకుబడి ఉన్న ప్రాంతాల్లో కలియదిరుగుతున్న పాల్... తనదైన శైలి కామెంట్లతో నిజంగానే కామెడీ చేస్తున్నారనే చెప్పాలి.
తన పార్టీలో సభ్యత్వాలు చేస్తే... కొంత మొత్తం నగదు ఇస్తానంటూ ఆయన చేసిన ప్రకటనలు సంచలనాలే అయ్యాయి. ఎక్కడికి వెళ్లినా... చాలా నిబ్బరంగానే కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్న పాల్.. ఆదివారం మాత్రం ఏకంగా ఏడ్చేసినంత పనిచేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పాల్ కంట కన్నీరు ఒలికింది. తనను అరెస్ట్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాల్.... అక్కడికక్కడే ఏడ్చేశారు. తన అరెస్ట్ దిశగా కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన పాల్... తాను రూ.30 వేల కోట్లు వసూలు చేశానని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ, జనసేన ఓట్లను చీల్చటానికి తాను రాలేదని... కొందరు చెబుతున్నట్టు తాను.. చంద్రబాబు వదిలిన బాణం కానే కాదన్నారు. అంతటితో ఆగని పవన్ వైసీపీపై తనదైన శైలి ఆరోపణలు గుప్పించిన పాల్.. త్వరలోనే విజయమ్మ, జగన్ ను.. మీకు రాజకీయం అవసరమా? అని ప్రజలు ప్రశ్నిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా అన్ని పార్టీలపై తనదైన శైలి ఆరోపణలు చేస్తూ వస్తున్న పాల్ ఇలా సడెన్ గా... ఒక్క వైసీపీపేనే విరుచుకుపడటం చూస్తుంటే కథ చాలా పెద్దదిగానే ఉందన్న వాదన వినిపిస్తోంది.