ఎంపీగా పోటీ చేస్తా - కేఏ పాల్‌

Update: 2019-03-19 05:34 GMT
రాజకీయాల్లో కామెడీ తగ్గిపోతున్న వేళ నేనున్నానంటూ వచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. తన ప్రజాశాంతి పార్టీ రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. అందుకు తగ్గ ఏర్పాటు అన్నీ చాలా ఫాస్ట్‌ గా జరిగిపోతున్నాయని చెప్పిన కేఏ పాల్‌.. అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇప్పటివరకు అభ్యర్థుల్ని ప్రకటించని పాల్‌.. ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనేది మాత్రం ఆయన చెప్పలేదు.
  
తణుకులో పాస్టర్ల సదస్సులో కేఏ పాల్ పాల్గొని మాట్లాడారు. ఏపీలో 175 అసెంబ్లీ - 25 ఎంపీ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఒక్క అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ ను అమెరికాను చేస్తానని చెప్పారు. మోదీ - చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. మార్చి 20లోపు మొదటి లిస్ట్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. అయితే ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని చెప్పి కేఎ పాల్‌.. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తానని అంటున్నారు. రోజుకో మాట మాట్లాడడం - మాట మీద నిలబడకపోవడం కేఏ పాల్‌ స్టైల్‌. 2014 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే పోటీ చేయబోతున్నాం చేస్తున్నాం అంటూ హడావిడి చేసిన పాల్ చివరి నిముషంలో తన అభ్యర్థుల లిస్టు ఉన్న సిడీని ఎవరో కొట్టేశారు అంటూ మాయం అయిపోయారు. మరి ఈసారి అయినా పోటీ చేస్తారో లేదో వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News