కేఏ పాల్...సంచలన వ్యాఖ్యలకు - వివాదాస్పద కామెంట్లకు సుపరిచితులు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన పాల్...తన పార్టీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించనుందని - క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్య పోయే అవసరం లేదంటూ..పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా `భారతరత్న` మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని వరించిన రోజును బ్లాక్‌డేగా అభివర్ణించి మరింత సంచలనం సృష్టించారు. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని పరిణామాలపై స్పందించే పాల్..తాజాగా తన కుటుంబం గురించి వివరించారు. తొలిసారిగా తన భార్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తన భార్యతో అనివా మేరీ కిలారితో కలిసి మీడియా ముందు మాట్లాడటం ఇదే మొదటి సారి అని పేర్కొన్న పాల్ ఆమె గురించి వివరించారు. ఆమె చాలా పవర్ ఫుల‌్ ఫ్యామిలీ నుంచి వచ్చారని వివరించారు. ఆమె చాలా దైవభక్తి ఉన్న వారని పేర్కొంటూ తనతో సహా తన భార్య చేసిన ప్రార్థనల ఫలితంగా తన తల్లి బ్రతికిందని వివరించారు. ఆస్పత్రిలో డయాలసిస్ పొందుతున్న తన తల్లి బ్రతికే అవకాశం లేదని తాను భావించానని, సమాధి కూడా సిద్ధం చేశామని అయితే కేవలం ప్రార్థనల వల్ల ఆమె బ్రతికిందని పాల్ వెల్లడించారు.
ఇక తన ప్రజాశాంతి పార్టీ గురించి మాట్లాడుతూ తన భార్య అనివా పార్టీ ఉపాధ్యక్షురాలని తెలిపారు. జ్యోతి బేగల్ ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్నారని, తన తండ్రి - తన తనయుడు, సోదరుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. ఎంతో కాలంగా వారు తన పార్టీ కోసం శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా పాల్ వివరించారు. తన ఆస్తుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కుట్రలు విఫలం అయ్యాయని పేర్కొన్న పాల్ నా సొంత ఆస్తులు నా సొంతం అయ్యాయని ప్రకటించారు.