వందల కోట్ల డబ్బు ఏరులై పారిన మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. నిన్నటి వరకు కొనసాగిన వాహనాల సందడి.. నాయకుల హడావుడి.. దుకాణాల్లో కొనుగోళ్ల హంగామా.. రాజకీయ పార్టీల డాంబికాలు.. ఇప్పుడేమీ లేవు. ఎక్కడో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లోని ఓ ఖరీదైన నియోజకవర్గంగా కనిపించిన మునుగోడు మళ్లీ మునుపటి మునుగోడులా.. సాదాసీదాగా మారిపోయింది.
ఇక ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ నాయకులు, పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంబరాల్లో మునిగిపోయారు. ఓడిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ వచ్చి తమ పార్టీ నాయకులతో మీడియాతో మాట్లాడారు. కానీ, ఆ అభ్యర్థి మాత్రం అక్కడే ఉండిపోయారు.
ఆయనంతే..
సాధారణంగా ఎన్నిక పూర్తయి.. ఓటమి పాలైన తర్వాత కొంత నిస్తేజం వస్తుంది. గెలుపొందిన వారు ఉత్సాహంగా ఉన్నా మిగతా అందరూ నిరుత్సాహంతో ఉంటారు. మునుగోడులాంటి ఖరీదైన ఉప ఎన్నిక జరిగినచోట ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.
అయితే, ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు, మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) మాత్రం ప్రత్యేకత చాటారు. ఓటమి నిర్వేదాన్ని దాటి నియోజకవర్గంలో ఉన్నారు. చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.
కేటీఆర్ దత్తత అంటే అవినీతి, ఆక్రమణలే..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పిన అంశం.. నియోజకవర్గ దత్తత. ఆ హామీ ప్రజల్లోకి బాగా వెళ్లింది. అసలే వెనుకబడిన ప్రాంతం కావడం.. కేటీఆర్ భరోసా ఇవ్వడంతో ప్రజలకు నమ్మకం కలిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఫ్లోరైడ్ భూతంపై టీఆర్ఎస్ చేసిన పోరాటం గుర్తుచేస్తూ ప్రచారం సాగింది.
కాగా, ఇప్పుడు కేఏ పాల్.. కేటీఆర్ దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూముల ఆక్రమించడం, అమ్ముకోవడం, రూ.లక్షల కోట్లు దోచేయడమేనంటూ మండిపడ్డారు. మరోవైపు ఉప ఎన్నికలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని తాను డిమాండ్ చేసినా.. అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారులు టీఆర్ఎస్ తరఫున పనిచేశారని విమర్శించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.