పాల్ మీద దాడికి ఆ పార్టీ కార్యకర్తలు వచ్చారట

Update: 2019-04-07 07:38 GMT
ప్రజాశాంతి పార్టీ అధినేత.. హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కాసింత రిలాక్స్ అయ్యేలా చేస్తున్న కేఏ పాల్ తాజాగా కొత్త మాట చెప్పటం షురూ చేశారు. తాను బస చేసిన హోటల్ కు అర్థరాత్రి వేళ తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. తనపై దాడికి ప్రయత్నించిన వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలుగా ఆయన ఆరోపిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత తానున్న హోటల్ కు కొందరు జగన్ పార్టీ కార్యకర్తలు వచ్చి.. దాడి చేసే యత్నం చేశారన్నారు.

ఆ దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డు అయినట్లుగా పాల్ చెబుతున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పాల్ బరిలో ఉండటం తెలిసిందే.  తనపై దాడికి ప్రయత్నించిన వారి వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని .. ఎలక్షన్ కమిషన్ తనకు జెడ్ ప్లస్ సెక్యురిటీ ఇవ్వాలని చెబితే.. ఏపీ రాష్ట్ర డీజీపీ ఒక గన్ మాన్ ను మాత్రమే ఇచ్చినట్లుగా ఫేర్కొన్నారు.

తనకు సెక్యురిటీని వెంటనే పెంచాలన్న పాల్.. తాను ఫిర్యాదు చేస్తే కనీసం సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించలేదని వాపోయారు. తనకు ఎదురవుతున్న దారుణ పరిస్థితులు చూస్తుంటే.. జగన్ ఎంతటి నీచమైన రాజకీయాలకు దిగజారాడో అర్థమవుతుందన్నారు. జగన్ రావాలి.. జగన్ కావాలి అంటున్నారు దేని కోసం?  హత్యా రాజకీయాలకా?  ఆయన చేతికే అధికారం వస్తే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిగిలిన సంగతుల్ని పక్కన పెడితే.. పాల్ లాంటోడి మీద దాడి చేయటానికి చేసిన ప్రయత్నంలో నిజానిజాల లెక్కను పోలీసు అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు?
Tags:    

Similar News