గడిచిన వారం రోజులుగా స్టేట్ మెంట్ల మీద స్టేట్ మెంట్లు ఇచ్చేస్తూ.. ఏపీ రాజకీయాల్లో నెలకొన్న వేడిని తన మాటలతో చల్లారుస్తున్నారు కేఏ పాల్. మత ప్రభోదకుడిగా సుపరిచితుడు.. తర్వాతి కాలంలో రాజకీయ పార్టీ పెట్టి.. ఎలాంటి ప్రభావాన్ని చూపించలేని ఆయన.. తన స్టేట్ మెంట్లతో చురుకు పుట్టించే ప్రయత్నం చేస్తుంటారు.
బడాయి మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచినట్లు ఉండే కేఏ పాల్.. ఊహించని విధంగా మాట్లాడేస్తుంటారు. అయితే.. ఆయన మాటలన్ని నవ్వు పుట్టించేలా ఉంటాయి. తాజాగా అదే కోవలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి వంద అసెంబ్లీ స్థానాల్లో విజయం ఖాయమన్నారు.
25 అంచెల ప్రణాళికతో వెళుతున్నామని.. విజయం తమదేనని.. ఏపీ అధికార పక్షానికి.. విపక్షానికి చెరో పది సీట్లు చొప్పున కూడా రావన్నారు. ఒక్కరంటే ఒక్క బలమైన నాయకుడు.. ఆ మాటకు కేఏ పాల్ స్వయంగా పోటీలోకి దిగితే గెలుస్తారో లేదో నమ్మకం లేని ఆయన.. ఈ తరహాలో మాట్లాడటం ఇప్పుడు కామెడీగా మారినట్లు చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. తనతో కలిసి పవన్ పోటీ చేస్తే తాము వంద సీట్లు గెలవటం ఖాయమని.. అదే సమయంలో పవన్ కానీ విడిగా పోటీ చేస్తే ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉండదన్నారు. జనసేన సింగిల్ గా పోటీ చేస్తే.. ఒక్క సీటు కూడా గెలవదన్నారు. పవన్ గెలవడని.. ఆయన ఓడిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కలిసొస్తే సర్దుబాటు చేసుకుంటామన్న పాల్.. బాబు.. జగన్ ఇద్దరు అవినీతిపరులన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బహిరంగ చర్చకు తాను సిద్దమన్నా.. వారిద్దరూ చర్చకు ముందుకు రావటం లేదన్నారు.