పవన్ కళ్యాణ్‌ ను నమ్మకండి - సినిమాల్లోకి వెళ్లాల్సిందే: కేఏ పాల్

Update: 2020-08-08 14:05 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ - తాను కలిస్తే బావుంటుందని చెప్పిన పాల్.. ఇప్పుడు జనసేనానిపై దుమ్మెత్తిపోశారు. పవన్‌ కు నీతి - నిజాయితీలు లేవని, - కట్టుబాట్లు లేవని - అందుకే పెద్ద పెద్దవాళ్లు ఆయన పార్టీని విడిచి వెళ్తున్నారని - ఎమ్మెల్యే కూడా కాకముందే ఏడాదికో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని - ఎమ్మెల్యే అయితే ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అందుకే ఆయనను నమ్మవద్దని ఘాటుగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవమని - తనకు తమ్ముడిలాంటివాడు అంటూనే తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీజేపీ యూజ్ అండ్ త్రో పార్టీ అని తెలిసినప్పటికీ వారితో వెళ్తున్నారని, కాబట్టి పవన్ ఇంతకంటే దిగజారే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోవడం లేదన్నారు. 2014లో బీజేపీ-టీడీపీకి మద్దతిచ్చారని - 2019లో వారికి దూరమై బీఎస్పీని - కమ్యూనిస్టులతో కలిసి తిరిగారని గుర్తు చేశారు. ఇప్పుడు కమ్యూనిస్టులను వదిలేసి అధికార దాహంతో కమలం పార్టీ చెంతకు చేరారని ఆరోపించారు.

ఏపీలో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌ కు కనీసం రెండు శాతం పడలేదన్నారు. పవన్ జీవితంలో సీఎం కాలేరని - ఆయన డ్యాన్స్‌ లు వేసుకోవడానికి సినిమాల్లోకి వెళ్లడమే మంచిదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేఏ పాల్ విమర్శలు గుప్పించడంతో ఆయనను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
Tags:    

Similar News