క్రైస్తవ మత బోధకుడిగా కేఏ పాల్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉండవచ్చు గాక... రాజకీయాల్లో మాత్రం అంత సీను లేదు కదా. 2004 ఎన్నికలకు ముందు వరకూ పాల్ కు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని చెప్పాలి. అయితే 2004 ఎన్నికల తర్వాత ఎందుకనో ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. ఏ ఒక్కరి మద్దతు గానీ - ఏ ఒక్కరి సలహా గానీ తీసుకోకుండానే ఆయన రాజకీయ రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో ఇప్పటికే డొక్కామక్కీలన్నీ తినేసిన పాల్... ఈ ఎన్నికల్లో తనదైన శైలి కామెడీని పండించేస్తున్నారు. ప్రజా శాంతి పేరిట పార్టీని పెట్టిన పాల్... హెలికాప్టర్ గుర్తు సంపాదించుకుని ఏపీలో విపక్షం వైసీపీకి చుక్కలు చూపే యత్నమైతే చేశారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తేలిన పాల్... అక్కడ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. పగిలిపోయే గ్లాసుకు - తుప్పు పట్టి పోయే సైకిల్ కు ఓటు వేయవద్దని ఆయన ప్రజలను కోరారు. చంద్రబాబు - పవన్ కల్యాణ్ లకు ఓటు వేస్తే నష్ట పోయేది ప్రజలేనని కూడా ఓ రూలింగ్ ఇచ్చేశారు. కేసీఆర్ కు భయపడిపోయిన చంద్రబాబు పద్దెనిమిది మంది పోలీసులను తీసుకుని ఏపీకి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును భయపెట్టిన కేసీఆర్... తనను చూస్తే మాత్రం పారిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముక్కు పిండేస్తానని - కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని కూడా పాల్ చెప్పారు.
రాష్ట్రానికి నిధులు తేవాలంటే చంద్రబాబు - పవన్ లతో సాధ్యం కాదని వ్యాఖ్యానించిన పాల్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - సీఎం చంద్రబాబు తన ముందు నిలబడి అడుక్కున్న వారేనన్నారు. ఇక పవన్ గురించి మాట్లాడుతూ గీయించుకునే కాపుకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. పవన్ - నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారని చెబుతున్నారని - అయితే ఆ ఇచ్చేది ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. సింగిల్ రూపాయి కూడా తీసుకొచ్చే సత్తా వారి ద్ద లేదని పేర్కొన్న పాల్... ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుని కట్నంగా తీసుకొచ్చి ఇస్తారా అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.