తెలుగు రాష్ట్రాల పొలిటికల్ మాస్టర్ పీస్... కేఏ పాల్ తన మీడియా ఉధృతిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నోట మరో ముత్యం రాలింది. నిత్యం తనదైన వ్యాఖ్యలు, హావభావాలతో హాస్యం పండిస్తూ మీడియాకు - జనాలకు కావల్సినంత వినోదం అందిస్తున్న కేఏ పాల్ తాజాగా మెగా ఫ్యామిలీ సొంత నియోజకవర్గంలోనే నాగబాబును ఓడిస్తాను... ఛాలెంజ్ అంటున్నాడు.
నాగబాబుకు తమ్ముడు పార్టీలో నరసాపురం ఎంపీ టిక్కెట్ దక్కిన విషయం తెలిసిందే. ఇది తెలిశాక అక్కడ పోటీ చేస్తానని అనడం లేదు పాల్. పాలకొల్లుకు పోదాం రా నాగబాబు - నిన్ను నీ ఊర్లో ఓడిస్తా అని సవాలు విసురుతున్నాడు. ప్రజాశాంతి పార్టీ గాలిలో అందరూ కొట్టుకుపోతారని చెప్పిన పాల్ ఏపీలో ఉన్న ఏకైక ప్రధాన పార్టీ ప్రజా శాంతి పార్టీయే అన్నారు.
‘‘నాగబాబు పాలకొల్లులో పోటీ చేస్తే.. నేనూ పోటీ చేస్తా. మనకు కావలసింది.. నటులు కాదు. అభివృద్ధి కావాలి. నిరుద్యోగం పోవాలి. అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో అపోలో కంటే మెరుగైన హాస్పిటల్స్ ప్రారంభిస్తా. అమెరికాను మించిపోయేలా ఏపీని తీర్చిదిద్దుతా. సీట్ల కోసం టీడీపీ - వైసీపీలలో కొట్టుకోవద్దు. బయటకు వచ్చేయండి. 28 లక్షలు ఖర్చు పెడితే మీరే ఎమ్మెల్యే. 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎంపీ* అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఇంతకాలం తనే అందరికీ ఆదర్శం అని చెప్పిన పాల్ ఈరోజు కేజ్రీవాల్ ను ఆదర్శంగా తీసుకుని నేర్చుకోమంటున్నారు. ఏడు లక్షలతో ఢిల్లీని 15 ఏళ్లు పాలించిన షీలా దీక్షిత్ ను ఓడించాడు కేజ్రీవాల్. నాకైతే ఐదు లక్షల రూపాయలు చాలు అంటున్నాడు. అవినీతి వద్దు. ఎన్నికల సంఘం పరిమితి మీరొద్దు. ప్రజాస్వామ్య యుతంగా గెలుద్దాం. చట్టప్రకారం 28 లక్షలే ఖర్చు చేసి ఎమ్మెల్యే అవుదాం, రండి కదదలిరండి అని పిలుపునిచ్చారు పాల్. మొత్తానికి అవడానికి పాల్ కామెడీ పీస్ అయినా... ఆధునిక మీడియాకు ఆయన బంగారుబాతులా ఉన్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే పాల్ వీడియో ఏది చూసినా.. లక్షల్లోనే వ్యూస్. పాపం వారంతా సీరియస్ ఫాలోయర్స్ అనుకుంటున్నారాయన.