కాచిగూడ రైలు ప్రమాదం.. మరో విషాదం

Update: 2019-11-17 07:06 GMT
హైదరాబాద్ కాచిగూడ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. రైళ్లు ఢీకొన్న ఘటనలో రైళ్లమధ్యలో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ రైలు లోకో పైలెట్ చంద్రశేఖర్ మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి.

కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న హంద్రీ ఎక్స్ ప్రెస్ ను , హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. సిగ్నల్ ను గమనించకుండా లోకో పైలెట్ డ్రైవర్ అయిన చంద్రశేఖర్ వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. రెండు రైళ్ల ఘటనలో రైళ్ల ఇంజిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అందులో ఇరుక్కుపోయిన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 7 గంటల పాటు రైలును కట్ చేసి అతడిని బయటకు తీయాల్సి వచ్చింది. అయితే అప్పటికే అతడికి తీవ్ర రక్తస్రావమైంది.

రైళ్లు ఢీకొన్న 7 గంటల తర్వాత లోకో పైలెట్ చంద్రశేఖర్ ను ఇరుక్కుపోయిన రైలు నుంచి రక్షించి కేర్ ఆస్పత్రికి తరలించారు. రెండురోజుల క్రితం అతడి కాలు సెప్టిక్ కావడంతో పూర్తిగా ఒక కాలును వైద్యులు తీసివేశారు. అప్పటి నుంచి బీపీ పెరుగుతూ కండీషన్ క్రిటికల్ గా మారింది.

తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించి శనివారం రాత్రి మృతిచెందాడు. ఇప్పటికే చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యిందని రైల్వే అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఇతడు మృతి చెందడంతో ఈ మొత్తం వ్యవహారం ముగిసినట్టైంది. 
Tags:    

Similar News