అప్పుడెప్పుడో కేసీఆర్ అన్నట్టు ‘ఈ బీజేపీ నేతలది అంతా సప్పుడు చేసుడే కానీ.. సాధించింది ఏం లేదని.. రూపాయి పనిచేయరని.. బాతకాలు కొడుతారని’ అన్న మాటలు ఇప్పుడు మళ్లీ బీజేపీ వ్యతిరేకులు తీసి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయినా.. అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయినా సరే ఊకదంపుడు ఉపన్యాసాలతోనే కాలం గడుపుతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేస్తున్నారు.
తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కడపలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
‘జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టేది ఒక్క బీజేపీ మాత్రమే’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రెండేళ్లలోనే వైసీపీ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం వందల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బు ఏమైందని సోము వీర్రాజు తాజాగా జగన్ సర్కార్ ను నిలదీశారు..
అయితే కడపకు వందల కోట్లు కేంద్రం ఇచ్చిందా? అని కడప ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. అన్ని వందల కోట్లు ఇస్తే కడప అద్దాల తునకగా మారాలని.. ఎందుకు ఇలా అయ్యిందని నిలదీస్తున్నారు. ఎందుకు గాలి మాటలు చెబుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు..
సోము వీర్రాజు ఉత్తమాటలు చెప్పొద్దని.. ఆ వందల కోట్లు డీటేయిల్స్ ఇస్తే నిధుల లెక్కు చూసి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కడప ప్రజలు అంటున్నారు. మరి దీనికి సోము వీర్రాజు సమాధానం చెబుతారో లేదో చూడాలి..