తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా ఐదు గంటలపాటు చర్చించింది. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.....
- రైతుల ఆత్మహత్యలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. రైతులు అధైర్యపడకుండా కష్టాలను ఎదుర్కోవాలి. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
- రైతులను ఆదుకునేందుకు అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జిల్లాల వారీగా రైతు ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరిహారం పెంచాం.
- గతంలో లక్షా యాభై వేల రూపాయాలు పరిహారం ఇచ్చేవారు. నేటి నుంచి రూ. 6 లక్షలు పరిహారం ఇస్తాం. ఇందులో రూ. 5 లక్షలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇస్తాం. మిగతా లక్షా రూపాయాలు రైతు చేసిన అప్పులు కడుతాం.
-ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలో పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆదుకుంటాం. దీనికి కులం/మతంతో సంబంధం లేదు.
- రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా అనేక చర్యలు చేపట్టాం.
- రైతుల రుణాలు మాఫీ చేశాం. ఇప్పటికే రుణాల మాఫీ కోసం రూ. 8,500 కోట్లను బ్యాంకులకు చెల్లించాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశాం. కోతల్లేని విద్యుత్‌ను సరఫరా చేశాం.
-వచ్చే ఏప్రిల్ 1 నుంచి పగటిపూట 9 గంటల కరెంట్ రైతులకు సరఫరా చేస్తామన్నారు.
- సెప్టెంబర్ 30 తర్వాత కరువు మండలాలను ప్రకటిస్తాం.
మీడియాకు హితవు
మీడియా - రాజకీయ పార్టీలు - స్వచ్ఛంద సంస్థలు రైతులకు ఆత్మ స్తైర్యం కల్పించాలని కడియం కోరారు. గోరంతను కొండంత చేసి రైతులను మానసికంగా ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని సూచించారు. రాజకీయాలతో రైతులను ఆడుకోవద్దని హితవు పలికారు.రైతుల ఆత్మస్థైర్యాన్ని పెంచేలా మీడియా వార్తలు రాయాలి అని కోరారు.