కలవకుండానే కడియం చెప్పుకున్నారా?

Update: 2015-12-04 07:44 GMT
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రహరి చేసిన ఒక ప్రకటన ఇప్పుడు వివాదంగా మారుతోంది. తన ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి తవార్ చంద్ గెహ్లాట్ ను కడియం శ్రీహరి కలిసినట్లుగా వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనలో ఐదుగురు కేంద్రమంత్రుల్ని కలిసినట్లుగా కడియం చెప్పినప్పటికీ.. వాస్తవానికి కలిసింది నలుగురినేనని చెబుతున్నారు.

కడియం శ్రీహరిపై తాజాగా ఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్రమంత్రిని కలవకుండానే.. కలిసినట్లుగా తమ పత్రికలో రాయించుకున్నారని మండిపడుతున్నారు. ఒకవేళ కలిసి ఉంటే.. మిగిలిన మంత్రులను కలిసినప్పుడు వేసినట్లుగా ఫోటో ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు.. కేంద్రమంత్రి గెహ్లాట్ అపాయింట్ మెంట్ ను కూడా కడియం తీసుకోలేదని చెబుతారు. కేంద్రమంత్రిని కలవకుండానే కలిసినట్లుగా చెప్పటంపై మండిపడుతున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించిన కడియం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రిని కలవకుండానే కలిసినట్లుగా చెప్పుకోవటం తప్పన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి.. ఇలాంటి విషయాల మీద కడియం ఏం సమాదానం చెబుతారో..?
Tags:    

Similar News