సోమిరెడ్డిపై నల్లధనం ఆరోపణలు

Update: 2016-12-23 09:58 GMT
సమాచారం ఇస్తే చాలు దాడులు చేస్తామంటున్నారు ఐటీ శాఖ అధికారులు. దీంతో వారిచ్చిన ఈమెయిల్ చిరునామాకు భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత - ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ కే ఫిర్యాదు చేయడానికి ప్రత్యర్థులు రెడీ అవుతుండడంతో ఆయనపై రైడ్స్ తప్పకవపోవచ్చని తెలుస్తోంది.
    
నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి.. సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిపై ప‌ఆరోపణ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియ‌తో మాట్లాడుతూ... సోమిరెడ్డి రూ.500కోట్లకు పైగా నల్లధనాన్ని విదేశాల్లో దాచారని అన్నారు. సోమిరెడ్డి కుటుంబ స‌భ్యుల‌ పేరుతో ప‌లుదేశాల్లో నగదు లావాదేవీలు జ‌రిపార‌ని - సింగపూర్‌ - మలేషియా - హాంకాంగ్‌ లలో 2001-2014 మధ్య కాలంలో రూ.140కోట్ల స్థిరాస్తులు కొన్నార‌ని ఆయ‌న ప‌లు ప‌త్రాలు చూపిస్తూ ఆరోపించారు. ఆయా దేశాల్లో ఆయ‌న‌కు ప‌లు భ‌వ‌నాలు ఉన్నాయ‌ని చెప్పారు. సోమిరెడ్డికి సంబంధించిన‌ రూ.350 కోట్ల న‌గ‌దుకు సంబంధించి ప‌లు బ్యాంకుల్లో లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు.
    
సోమిరెడ్డి న‌ల్ల‌ధ‌నానికి సంబంధించి ఆధారాల‌ను తీసుకెళ్లి తాను ఈడీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సోమిరెడ్డిపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. సోమిరెడ్డి కొన్నేళ్లుగా జరిపిన నగదు లావాదేవీలను ఐటీ అధికారుల‌కు తెల‌ప‌లేద‌ని కాకాని ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News