సోమిరెడ్డి మాంచి సౌండ్ పార్టీనేనట

Update: 2016-12-27 05:41 GMT
రోజులన్నీ ఒకేలా ఉండవు. రాజకీయాల్లోకి వచ్చిన తాను డబ్బులు పోగొట్టుకున్నానే కానీ.. ఆస్తుల్ని కూడబెట్టింది లేదంటూ నేతలు చెప్పే మాటలు ఎప్పుడూ ఒకేలా ఉండవేమో? నిత్యం బీద అరుపులు అరుస్తూ.. పేదరికం గావుకేకలు పెట్టే నేతల ఆస్తుల లెక్కల్లోకి నిశితంగా దృష్టి సారిస్తే కొంగొత్త విషయాలు కనిపించే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాన్ని కలిగించే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.

తాజాగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ టీవీ లైవ్ చర్చల్లో దర్శనమిస్తూ.. నీతులు బోధించే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఆస్తుల్ని కోల్పోయానని.. తాను పేదవాడినని.. పూట గడవదంటూ సోమిరెడ్డి చెప్పే మాటల్లో వాస్తవం లేదని.. ఆయన భార్యకు సంబంధించి పవర్ కంపెనీ ముచ్చటను కాకాణి బయటపెట్టారు.

కర్ణాటకలోని సాగర్ పవర్ కంపెనీలో సోమిరెడ్డి సతీమణి జ్యోతి డైరెక్టర్ గా ఉన్నట్లుగా కాకాణి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఆయన బయటపెట్టారు. కంపెనీ డైరెక్టర్ల పత్రాల్ని విడుదల చేసిన ఆయన.. కంపెనీలో రూ.30కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా ఉన్నట్లు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణలు తప్పని తేలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ విసిరారు. మరిలాంటి షాకింగ్ ఇష్యూ మీద సోమిరెడ్డి ఎలా స్పందిస్తారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News