కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక పుణ్యమా అని ఇప్పుడు ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటిదాకా ఈ తూటాలు ఓ మాదిరిగా ఉన్నా... మొన్న నంద్యాలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభ తర్వాత వీటి ఘాటు మరింతగా పెరిగిందనే చెప్పాలి. అవకాశవాద రాజకీయాలకు తాను మద్దతివ్వబోనని ప్రకటించిన వైఎస్ జగన్... తన పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చిన చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి చేత బహిరంగ సభా వేదిక పైనే, ప్రజల సమక్షంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించిన వైనం ఇప్పుడు ఈ మాటల తూటాలకు మరింతగా పదును పెంచిందనే చెప్పాలి. జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై స్పందించేందుకు నోరు పెగలని టీడీపీ నేతలు... ప్రజా కంటక పాలన సాగిస్తున్న చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై నానా యాగీ చేస్తున్నాయన్న వాదన కూడా లేకపోలేదు.
పార్టీ ఫిరాయింపులపై జగన్ సంధించిన అస్త్రాన్ని ఆసరా చేసుకుని వైసీపీ మాటల దాడిని పెంచగా, చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన రాజకీయ ప్రత్యర్థి - వైసీపీ ఎమ్మెల్యే - వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిలు మరింతగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సాధారణంగానే ఏ అంశంపై అయినా సోమిరెడ్డి - కాకాణి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. సోమిరెడ్డి సొంత నియోజవకర్గం ఎమ్మెల్యేగా కాకాణి కొనసాగుతుండటం సోమిరెడ్డికి నిజంగానే ఇబ్బందిగా ఉన్నట్టుంది. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్నా కూడా కాకాణికే ప్రాధాన్యం దక్కుతుందన్నది ఆయన ఆవేదనగా తెలుస్తోంది.
ఈ క్రమంలో జగన్ పై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు మీడియా ముందుకు వచ్చిన కాకాణి... సోమిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ చర్యతో తల బొప్పి కట్టిన టీడీపీ నేతలు, ప్రత్యేకించి సోమిరెడ్డి లాంటి వారికి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని కాకాణి విరుచుకుపడ్డారు. అయినా సోమిరెడ్డి స్థాయి ఏమిటో జనాలకు తెలుసన్న కాకాణి... సోమిరెడ్డి స్థాయి లాఠీకి ఎక్కువగా, తూటాకు తక్కువగా ఉందని అభివర్ణించారు. చంద్రబాబుది హత్యలు చేయించిన చరిత్ర అని ఆయన అన్నారు. రంగాతో పాటు ఒక జర్నలిస్ట్ ను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. శిల్పాతో ప్రజల సమక్షంలో రాజీనామా చేయించిన జగన్ చర్యతో... మంత్రులు, టీడీపీ నేతలకు మతిభ్రమించిందని కాకాణి అన్నారు.