సుప్రీం కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డికి ఊరట లభించింది. నకిలీ డాక్యుమెంట్ల కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాలలో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసును కొట్టేయాలంటూ కాకాణి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు స్పందిస్తూ ఈ కేసులో పోలీసు విచారణకు సహకరించాలని కాకానిని ఆదేశిస్తూ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో కాకాణి జిల్లా కోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ వేయగా, లొంగిపోవాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కాకాణి మరలా హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో గోవర్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు కాకాణికి బెయిల్ మంజూరు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/