హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో 2 రోజుల క్రితం సినీ నటుడు మోహన్ బాబును మాజీ ఎంపీ - కళా బంధు టి.సుబ్బరామి రెడ్డి సన్మానించి ‘విశ్వనట సార్వభౌమ’ బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు 42 వసంతాల నట ప్రస్థానానికి గుర్తుగా సుబ్బరామి రెడ్డి ఈ బిరుదు ఇచ్చి ఘనంగా సత్కరించారు. `కాకతీయ కళా వైభవం`పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు - రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే, తాజాగా ఈ కార్యక్రమంపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. `కాకతీయ కళా వైభవం` పేరుతో సినీ నటులను సన్మానిస్తే సహించబోమని ట్రస్ట్ సభ్యులు హెచ్చరించారు.
`కాకతీయ కళా వైభవం` పేరుతో స్థానిక కళలు - కళాకారుల పురోగతికి తోడ్పడితే తాము స్వాగతిస్తామని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు మీడియాకు తెలిపారు.బుద్ధిస్ట్ హెరిటేజ్ కు సినిమా సంస్కృతిని జతచేయడం సరికాదని, అటువంటి ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సుబ్బరామిరెడ్డికి సూచించారు. సినీ పరిశ్రమ వల్ల తెలంగాణ సంస్కృతికి భంగం కలిగిందని, తీరని నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టకుండా ఉండాలని ఆయన సూచించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సుబ్బరామిరెడ్డి స్పందించలేదు.