చంద్రబాబు నిర్ణయాలు కాస్త చిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగా.. చర్చకు దారి తీసేలా ఉంటాయి. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చేయాలన్న నేపథ్యంలో.. పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించనున్న ఆయన.. ఏపీకి ఒక పార్టీ అధ్యక్షుడ్ని.. తెలంగాణకు మరో నేతను ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా.. పార్టీ సీనియర్ నేత.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉణుకూరు ఎమ్మెల్యే కళా వెంకట్రావును ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకున్నా.. సింగపూర్ పర్యటనకు వెళ్లే ముందు..ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
బీసీ నేత అయిన కళా వెంకట్రావుకు టీడీపీతో అనుబంధం ఎక్కువే. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు.. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. తాజాగా క్యాబినెట్ లోనూ ఆయనకు మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే.. సామాజిక కారణాల వల్ల.. కాంబినేషన్ కుదరక అమాత్య పదవి దక్కలేదని చెబుతారు. ఈ కారణంగా.. ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఒక కొరత తీరుతుందని బాబు భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఏపీ ప్రజలకు సుపరిచితుడే అయినప్పటికీ.. మాస్ అప్పీల్ ఏ మాత్రం లేని కళా వెంకట్రావ్ ను ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయటం చూస్తే.. భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి.. స్వల్ప కాలం ఉండి.. తిరిగి పార్టీలోకి వచ్చేసిన కళా వెంకట్రావ్ కి పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయం విస్మయాన్ని రేకెత్తించేదే.
మంచి మాటకారులు.. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారిని వదిలేసి.. బీసీ వర్గానికి చెందిన కళా వెంకట్రావ్ కు ఏపీ పార్టీ పగ్గాల్ని అప్పగించాలన్న తీరు చూస్తే.. కళా వెంకట్రావ్.. పార్టీకి కొత్త కళ తెచ్చే కన్నా.. తన కళ పెంచాలన్న భావనకే పెద్ద పీట వేసినట్లుగా కనిపిస్తోంది.