టీడీపీ ఎమ్మెల్యేకు క‌ళానికేత‌న్ 2 కోట్ల లంచం ఆఫ‌ర్‌!

Update: 2016-06-22 04:20 GMT
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళానికేతన్‌ కేసులో పోలీసుల విచార‌ణ‌లో ప‌లు షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సంస్థ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీశార‌ద‌ను అరెస్టు చేయ‌డంతో తీగ‌లాగితే డొంక క‌దిలిన చందంగా ఒక్కో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఇక ఎండీ లీలాకుమార్‌ ను అనంత‌పురం పోలీసులు అదుపులోకి తీసుకుని సోమ‌వారం ఆయ‌న్ను హైద‌రాబాద్ తీసుకువ‌చ్చి ర‌హ‌స్య ప్రాంతంలో విచార‌ణ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

 అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రంలో చేనేత కార్మికుల నుంచి రూ 9.36 కోట్ల చీర‌ల‌ను తీసుకున్న క‌ళానికేత‌న్ వారికి ఆ సొమ్ములు చెల్లించ‌క‌పోవ‌డంతో వారు క‌ళానికేత‌న్ ఎండీతో పాటు సంస్థ‌లోని కొంద‌రు డైరెక్ట‌ర్ల‌పై కేసులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌న‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం రాష్ర్ట వ్యాప్తంగా కళానికేత‌న్ సంస్థకు రూ.65 కోట్ల అప్పులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 ఈ నేప‌థ్యంలోనే పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన క‌ళానికేత‌న్ యాజ‌మాన్యం ఓ టీడీపీ ఎమ్మెల్యేకు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌హ‌క‌రించాల‌ని రూ.2 కోట్ల లంచం ఇవ్వ‌చూపింద‌ట‌. ఈ విష‌యాన్ని స‌ద‌రు ఎమ్మెల్యేనే పోలీసుల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రంలోని చేనేత కార్మికుల నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా చీర‌లు కొనుగోలు చేస్తున్న క‌ళానికేత‌న్ అక్క‌డ కార్మికుల‌కు రూ.9 కోట్ల వ‌ర‌కు బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది.

 దీంతో క‌ళానికేత‌న్ సంస్థ ఈ కేసు నుంచి తప్పించాలంటూ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఆశ్రయించింది. త‌మ‌కు సాయం చేస్తే రూ.2 కోట్ల వ‌ర‌కు ఇచ్చుకుంటామ‌ని ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో ఎమ్మెల్యే ఈ ఆఫ‌ర్‌ ను తిర‌స్క‌రించడంతో పాటు ఈ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. ఎమ్మెల్యే ఇదే విష‌యాన్ని మీడియాకు సైతం వెల్ల‌డించ‌డం విశేషం. రాష్ర్ట వ్యాప్తంగా క‌ళానికేత‌న్ లీల‌ల గురించి ఒక్కో మ్యాట‌ర్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తోంది. భ‌విష్య‌త్తులో క‌ళానికేత‌న్ లీల‌లు ఇంకెన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.
Tags:    

Similar News