కళానికేతన్ డైరెక్టర్ ను అలా అరెస్ట్ చేశారా?

Update: 2016-06-07 04:58 GMT
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ సతీమణి.. కంపెనీ డైరెక్టర్ అయిన లక్ష్మి శారదను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని చేనేత తయారీదారులకు రూ.9కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. ధర్మవరానికి చెందిన 80 మంది చేనేత తయారీదారుల నుంచి రూ.9కోట్లు విలువైన వస్త్రాల్ని కళానికేతన్ సంస్థ కొనుగోలు చేసింది. కానీ.. వీరికి డబ్బు చెల్లించలేదు.

దీంతో.. వారు ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదును తీసుకున్న ధర్మవరం ఎస్ ఐ సునీత నేతృత్వంలో ఒక బృందం హైదరాబాద్ కు వచ్చింది. వారు ఫిలింనగర్ సమీపంలోని కళానికేతన్ ఎండీ ఇంటికి వెళ్లారు. పోలీసులు తన ఇంటికి రావటంతో కళానికేతన్ ఎండీ లీలా ప్రసాద్ పారిపోయారు. ఆయన సతీమణి.. కళానికేతన్ డైరెక్టర్లలో ఒకరైన లక్ష్మీ శారద బాత్రూంలో దాక్కున్నారు. ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు.. బాత్రూంలో దాక్కున్న లక్ష్మీ శారద ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో బాత్రూమ్  తలుపు పగలకొట్టి మరీ అరెస్ట్ చేయటం గమనార్హం.
Tags:    

Similar News