వార్షిక వేతనం అందుకోవడంలో సన్ టీవీ అధినేత కళానిధి మారన్, కావేరీ కళానిధి మారన్ ప్రపంచ అపరకుబేరుడు అంబానీని మించిపోయారు. సన్ టీవీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న కళానిధి, కావేరి 2019 -20 సంవత్సరంలో అత్యధిక వార్షిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్ లుగా నిలిచారు. ఈ దంపతుల వార్షిక వేతనం ఎంతో తెలిస్తే షాకవాల్సిందే. ఏడాదికి వారిద్దరూ వేతనం గా అందుకున్న మొత్తం రూ. 175 కోట్లు. కళానిధి మారన్ 1993లో ఈ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ టీవీకి ఆయనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్. కళానిధి కావేరీ సంవత్సరానికి రూ. 13.87 కోట్ల చొప్పున వార్షిక వేతనం తీసుకుంటున్నారు. దీంతో పాటుగా మరో రూ. 73. 63 కోట్లు ఎక్స్ గ్రేషియాగా పొందుతున్నారు.
అంటే దంపతులు ఒక్కొక్కరికి ఏడాదికి అందుతున్న సొమ్ము రూ.87.50 కోట్లు . ఈ దంపతులతో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వార్షిక వేతనం కూడా తక్కువే. ఆయన వార్షిక వేతనంగా ఏడాదికి రూ.15 కోట్లు మాత్రమే అందుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఆయన తన వార్షిక వేతన పెంపును నిలిపేసుకున్నారు. 2008- 09 నుంచి ఇంతే మొత్తంలో వార్షిక వేతనాన్ని అందుకుంటున్నారు.కరోనా పరిస్థితుల్లో వేతనం కూడా తీసుకోకూడదని అంబానీ నిర్ణయించుకున్నారు.
ఇక సన్ టీవీ లో కళానిధి మారన్, కావేరీ మారన్ తర్వాత అధిక వేతనం పొందుతున్న వారిలో సన్ టీవీ ఎండీ మహేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన వార్షిక వేతనంగా రూ. 1.78 కోట్లు అందుకుంటున్నారు. దీనిలో 1.16 కోట్లు వేతనం, రూ. 0.62 కోట్లు ఎక్స్ గ్రేషియాగా పొందుతున్నాడు. మారం కుమార్తె కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య కూడా రూ.1.22 కోట్ల భారీ మొత్తాన్ని వార్షిక వేతనంగా అందుకుంటున్నారు. ఇందులో రూ. 42 లక్షలు ఎక్స్ గ్రేషియాగా పొందుతోంది. సన్ టీవీకి ఆదాయం కూడా భారీగానే అందుతోంది. గత ఏడాది రూ.3653 కోట్లు.. ఆదాయం అందగా ఈసారి రూ. 3883 కోట్లు లభించింది. పన్ను చెల్లించకుండా ఈ కంపెనీ ఆదాయం 1,797 కోట్లు. ఈ ఆదాయం గత ఏడాది తో పోలిస్తే తక్కువే. సన్ టీవీ ఇంత లాభాల్లో ఉంది కాబట్టే.. నిర్వాహకులు భారీ మొత్తం లో వార్షిక వేతనం పొందుతున్నారు.