కలియుగ కుంభకర్ణుడు అనగానే అందరికి ఆరు నెలలు పూర్తిగా నిద్రలోనే ఉండి , ఆ తర్వాత ఆరు నెలలు మేల్కొని ఉండే రాక్షసుడు ఉండేవాడు అని పురాణాల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు, వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే ఆధునిక కాలంలో మనిషి నిద్ర సమయంలో క్రమంగా తగ్గిపోతోంది. ఉద్యోగ, వ్యాపారాలపైనే ఫోకస్ పెడుతున్న నేటితరం నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చెప్పొచ్చు. అయితే ఎవరైనా ఎక్కువ సమయం నిద్రపోతుంటే అతడిని కుంభకర్ణుడితో పోలుస్తుంటారు. నిద్రలో ఆ కుంభకర్ణుడినే తలదన్నెవాడొకడు రాజస్థాన్ లో ఉన్నాడు. అతడు నెలల లో వరుసగా 25 రోజులు నిద్రలోనే గడుపుతాడు. అంటే ఏడాదిలో 300 రోజులు గుర్రుపెడతాడన్నమాట. సంవత్సరంలో ఓ యాభై రోజులు మాత్రమే స్పృహలో ఉంటాడు. నిద్రాదేవి ఇంతలా ఆవహించిన ఆయన 42 ఏళ్ల పుర్కారామ్ , ఊరు నాగౌర్.
వివరాల్లోకి వెళ్తే .. రాజస్థాన్ లోని నాగౌర్ కి చెందిన పుర్కారామ్ కుంభకర్ణుడిగా మారడానికి ఓ కారణం ఉంది. పనిలేక నిద్రలోనే గడిపేయడం లేదు. ఆక్సిస్ హైపర్ సోమ్నియా ’ అనే స్లీపింగ్ డిజార్డర్ తో పుర్కారామ్ గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా పూర్ఖారామ్‌కు చుట్టుప్రక్కల వారు కుంభకర్ణుడు అని పేరు పెట్టారు. 25 రోజుల తర్వాత నిద్రలేచినప్పుడే ఆయనకు స్నానం చేయించి భోజనం పెడుతున్నారు కుటుంబసభ్యులు. 23 ఏళ్ల వయసులో ఆయన ఈ అరుదైన వ్యాధి బారినపడ్డారు. తొలుత రోజులో 15 గంటలు నిద్రపోయేవాడు. ఆ తర్వాత 5-7 రోజులకోసారి నిద్రలేచేవాడట. ఇప్పుడు ఏకంగా నెలలో 20-25 రోజులు నిద్రపోతేనే ఉంటున్నాడట. ఎప్పుడైనా నిద్ర మేల్కోని ఏదైనా పని చేయాలంటే అతడి శరీరం సహకరించదు. తర్వాత ఆ సమయం పెరుగుతూ పెరుగుతూ నెలలో 25 రోజుల పాటు నిద్రావస్థలోనే గడిపేస్థాయికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే .. ఈ పుర్కారామ్ కు పెళ్లయింది. తన భర్త త్వరలోనే తిరిగి మాములు మనిషి అవుతాడని అయన భార్య ఆశాభావాన్ని వ్యక్తం చేశారు