ఇటీవల కాలంలో విదేశాల్లో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు ప్రాంతాలకు చెందిన వారు మృతి చెందుతున్నారు. తాజాగా మరో విషాద ఉదంతం చోటు చేసుకుంది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి ఒకరు మరణించారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన మునగాల కల్యాణ్ చక్రవర్తి అనే 30 ఏళ్ల యువకుడు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై వివరాలు అందలేదు. రోడ్డు యాక్సిడెంట్ లో చక్రవర్తి మరణించిన సమాచారం మేడ్చల్ జిల్లాలోని అతని కుటుంబ సభ్యులకు అందింది.
రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించాడన్న విషయం తెలుసుకున్న చక్రవర్తి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.