యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్న విషయం తెల్సిందే. మక్కల్ నీది మయ్యుం పార్టీని ఏర్పాటు చేసిన కమల్ హాసన్ మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాడు. తాను పోటీ చేస్తూ తన పార్టీ తరపున మొత్తం 150 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల ఆయన కాంచీపురంలో రోడ్డు షో లో పాల్గొని రాత్రి పొద్దు పోయిన తర్వాత హోటల్ వద్దకు చేరుకున్న సమయంలో ఆయన కారుపై దాడి జరిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దాడి ఎవరు చేశారు అనేది చిక్కుముడి ప్రశ్నగా నిలిచింది.
గుర్తు తెలియని ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెళ్లడయ్యింది. ఆ వ్యక్తి కమల్ కు వీరాభిమాని. కమల్ ను కలవాలనే ఉద్దేశ్యంతో కారు వైపు వేగంగా దూసుకు వచ్చాడు. ఆ సమయంలో కమల్ కూర్చున్న వైపు కాస్త బలంగా చేతితో కొట్టాడు. అతడు తాగి ఉన్న మైకంలో ఏం చేస్తున్నాడో తెలియకుండా కమల్ పై అభిమానంతో అలా చేసినట్లుగా పోలీసులు నిర్థారించారు. కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేసినట్లుగా కమల్ పార్టీ వర్గాల వారు చెబుతున్నారు.