తమిళ ‘రాజీ’కీయంలో వచ్చిన తాజా మార్పుపై డీఎంకే - దాని అనుకూల వర్గాలు మండిపడుతున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం కావడం తెలిసిందే. దీనిపై డీఎంకే నేత స్టాలిన్ తో పాటు డీఎంకేలో చేరుతారని ఊహిస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ధర్మయుద్ధం చేస్తున్నామని ఇంతకాలం కథలు చెప్పిన అన్నాడీఎంకే నేతలు పదవుల కోసం ఈ రోజు కలిసిపోయారని స్టాలిన్ విమర్శించారు. పదవుల కోసం పాకులాడడమే ధర్మ యుద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. పదవులు దక్కడంతో ఇక ధర్మయుద్ధం ముగిసిందా? అని ఎద్దేవా చేశారు.
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల కలయిక పెద్ద నాటకమని... పళనిస్వామి - పన్నీర్ సెల్వంను మించిన మహానటులు లేరని ఆయన అన్నారు.
మరోవైపు సినీ నటుడు కమల హాసన్ కూడా ఈ పరిణామంపై అర్థమయ్యీ కానీ భాషలో ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ‘గాంధీ టోపీ.. కాషాయ టోపీ... కాశ్మీర్ టోపీ.. ఇప్పుడు ఫూల్స్ టోపీ.. ఇది చాలదా?’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇది చాలా ప్రజలకు మరింత కావాలా? అని ఆయన అడిగారు. తమిళ ప్రజలు దయచేసి మేల్కోవాలని అన్నారు.